ప్ర‌పంచంలో రెండో అతి పెద్ద దేశం, ప్ర‌పంచ జ‌నాభాలో రెండో అతి పెద్ద దేశం అయిన భార‌త్‌కు ప్ర‌ధాని కావ‌డం అంటే నే ఓ ప్ర‌పంచ రికార్డును సాధించిన‌ట్టు. అది కూడా భిన్న‌త్వంలో ఏక‌త్వాన్ని అనుస‌రించే దేశానికి నాయ‌కుడు కావ‌డం చాలా చాలా క‌ష్టం. మ‌రీ ఇప్పుడున్న రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప్ర‌ధాని పీఠం అధిరోహించ‌డం మ‌రీ క‌ష్టం. మ‌రి ఇలాంటి అత్యున్న‌త అవ‌కాశాన్ని అందిపుచ్చుకున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఈ సమున్న‌త స్తానం యొక్క గౌర‌వాన్ని రాణించేలా వ్య‌వ‌హ‌రించారా? ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు దేశానికి ఉప యుక్తంగా మారాయా? మ‌రో ఏడెనిమిది మాసాల్లోనే లేదా మోడీ కోరుకుంటున్న‌ట్టు ముందుగానే సార్వ‌త్రిక ఎన్నిక‌లు వ‌స్తే.. ఆయ‌న విజ‌యం సాధిస్తారా? అనే చ‌ర్చ గ‌త కొన్ని రోజులుగా ఊపందుకుంది. 

Image result for bjp

జాతీయ, ప్రాంతీయ మీడియాలు సైతం ఇదే విష‌యంపై పెద్ద ఎత్తున చ‌ర్చించుకుంటున్నాయి. ఇక‌, మోడీ తీసుకున్న అత్యంత కీల‌క‌మైన నిర్ణ‌యాల్లో ప్ర‌ధాన‌మైన‌వి.. చాలా వ‌ర‌కు విఫ‌ల‌మ‌య్యాయి. ఆయ‌న త‌న‌ను తాను హీరోగా ప్ర‌క‌టించు కునేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు చాలా వ‌ర‌కు స‌క్సెస్ కాలేకపోవ‌డం బీజేపీకి ఖంగుతినిపించింది. పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం దేశాన్ని కుదిపేసింది. ప్ర‌పంచాని సైతం ఆక‌ర్షించిన ఈ నిర్ణ‌యం.. అన‌తి కాలంలోనే బీజేపీకి మంచి మార్కులు ప‌డేలా చేస్తుంద‌ని భావించినా.. ఆశించిన ఫ‌లాలు అందిచ‌డంలో మాత్రం తీవ్రంగా విఫ‌ల‌మ‌య్యేలా చేసింది. దేశంలోని ప్ర‌జ‌లు మొత్తాన్నీ బ్యాంకుల వ‌ద్ద ప‌డిగాపులు ప‌డేలా చేసింది .


ఇక‌, ఈ పెద్ద నోట్ల ర‌ద్దుతో న‌ల్ల‌ధ‌నం వెలికి వ‌స్తుంద‌ని, దానిని ప్ర‌జ‌ల ఖాతాల్లోకి మ‌ళ్లిస్తాన‌ని ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌టించినా .. అది కూడా కార్య‌రూపం దాల్చ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా మ‌రో అతిపెద్ద నిర్ణ‌యం జీఎస్టీ. ఇది దేశ వాణిజ్య రంగాన్ని ఇప్ప‌టికీ కోలుకోలేకుండా చేసింది. ఇది ప్ర‌వేశ పెట్టి రెండు సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా కూడా ఎలాంటి ప్ర‌యో జ‌నాల్నీ అందించ‌లేక పోయింది. దేశ ప్ర‌భుత్వం ఖ‌జానా నిండుతున్నా.. పేదలు మాత్రం తీవ్రంగా అల‌మ‌టిస్తు న్నారు. ఇక‌, అదేస‌మ‌యంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను రోజూ స‌మీక్షించి, పెంచుకునే వెసులుబాటును ఆయిల్ కంపెనీల‌కు క‌ట్ట‌బెడుతూ.. మోడీ తీసుకున్న నిర్ణ‌యం దేశాన్ని కుత‌కుత‌లాడిస్తోంది. ధ‌ర‌లు ఎక్క‌డా త‌గ్గ‌క‌పోగా.. నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. 

Image result for bjp

పైగా.. వీటి వ‌ల్ల ఇత‌ర వ‌స్తువుల ధ‌ర‌లు సైతం నానాటికీ ఆకాశానికి అంటుతున్నాయి. వీటికితోడు మోడీ విదేశాంగ విధానం కూడా భ్ర‌ష్టుప‌ట్టింద‌నే వ్యాఖ్య‌లు త‌ర‌చుగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. పాకిస్థాన్‌పై స‌ర్జిక‌ల్ స్ట్రైక్ చేశాన‌ని ఆయ‌న ఘ‌నంగా చెప్పుకొన్నా.. పాకిస్థాన్ మాత్రం ఇది అబ‌ద్ధ‌మేన‌ని ఇప్ప‌టికీ అంటోంది. అంతేకాదు.. దీనికి సంబంధించిన ఆధారాలు ఇప్ప‌టికీ వెలుగు చూప‌క‌పోవ‌డం మోడీ వైఫ‌ల్యాల జాబితాలో చేరింది. ఇక‌, రూపాయి విలువ ప‌డిపోవ‌డం, పేద‌లు పేద‌లుగానే ఉండ‌డం వంటివి.. కూడా మోడీ వైఫ‌ల్యాల కింద‌కే వ‌స్తాయి. అదేస‌మ‌యంలో రాష్ట్రాల‌తో కేంద్ర సంబంధాల విష‌యం.. గ‌త ప్ర‌ధాని ఇందిరాగాంధీ త‌ర్వాత మ‌రోసారి విస్తృతంగా చ‌ర్చ‌కు రావ‌డం కూడా మోడీ వైఫ‌ల్యం కిందికే వ‌స్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సో.. మొత్తానికి మోడీ వైఫ‌ల్యాల జాబితా చాలానే ఉంద‌ని చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: