ఈ భూమిపై కష్టపడ్డ వారికి ఎప్పటికైన ఫలితం ఉంటుందని మన పూర్వికులు చెబుతుంటారు. ఇది అక్షరాలా నిజం చేసి చూపించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ.   దక్షిణ గుజరాత్‌‌లోని మెహసానా అనే జిల్లాలోని వాద్ నగర్ అనే చిన్న పట్టణంలో సెప్టెంబర్ 1950న  నరేంద్ర మోడీ జన్మించారు. పుట్టుకతోనే ఒక సంస్కృతిలో పెరిగిన నరేంద్ర మోడిలో దాతృత్వం, దయ, సామాజిక సేవా గుణాలను అలవర్చుకున్నారు.  1960లో భారత్—పాక్ మధ్య జరిగిన యుద్దం సమయంలో కుర్రాడిగా  నరేంద్ర మోడీ సైనికులకు వాలంటరీగా పని చేశారు. 1967వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రం మొత్తం వరదలతో అతలాకుతలమై నప్పుడు బాధితులకు తన వంతు సేవలను అందించారు.  తన బాల్యం నుంచే  నరేంద్ర మోడీ అనేక అసమానతలను, అడ్డంకులను అధిగమించారు. వ్యక్తిత్వ  బలంతో, ధైర్యంతో అవకాశాలను సవాళ్లుగా మార్చుకున్నారు. 


ముఖ్యంగా ఉన్నత విద్య కోసం కాలేజీ, యూనివర్సిటీలో చేరినప్పుడు కఠినమైన పోరా టాలు చేయాల్సి వచ్చింది. కానీ జీవన సమరంలోఆయన ఎల్లప్పుడూ ఒక నిజమైన సైనికుడుగా ప్రవర్తించారు.  భారతదేశ సామాజిక, సాంస్కృతిక అభివృద్ధి కోసం స్దాపించిన సామాజిక సాంస్కృతిక సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో ఆయన పయనం మొదలైంది. దేశం పట్ల నిస్వార్ధ సేవ, సామాజిక బాధ్యత, అంకితభావం, జాతీయతా స్ఫూర్తిని పెంపొందించుకోవ డానికి ఇది దోహదపడింది.1987లో భారతీయ జనతా పార్టీలో చేరడం ద్వారా ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి ప్రవేశించారు. కేవలం ఒక్క సంవత్సర కాల వ్యవధిలోనే గుజరాత్ యూనిట్‌ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.


ఆ సమయానికే నరేంద్ర మోడీ అత్యంత సమర్థవంతమైన నిర్వాహకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు.  భారతీయ జనతా పార్టీ రాజకీయంగా పెద్ద శక్తిగా ఎదిగి ఏప్రిల్ 1990లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ భాగస్వామ్యం కొన్ని నెలలకే పరిమితమైనప్పటికీ.. భారతీయ జనతా పార్టీ 1995 లో గుజరాత్ లో సొంతంగా ఒక రెండు వంతుల మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.  1988, 1995 మధ్య గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవడంలో నరేంద్ర మోడీ చేసిన క్షేత్రస్థాయిలో చేసిన కృషి పనిచేసింది. దాంతో   నరేంద్ర మోడీని ప్రతిభావంతమైన వ్యూహాకర్తగా పార్టీ గుర్తించింది. నరేంద్ర మోడీకి రెండు కీలక జాతీయ కార్యక్రమాలు నిర్వహించే బాధ్యతను అప్పగించారు. ఎల్‌కె ఆద్వానీ సోమనాథ్ నుండి అయోధ్య వరకు చేపట్టిన రథయాత్ర ఒకటి కాగా, కన్యాకుమారి (భారతదేశం దక్షిణ భాగం) నుండి కాశ్మీర్ వరకూ చేపట్టిన యాత్ర రెండోది. 


నరేంద్ర మోడీ నిర్వహించిన ఈ రెండు అత్యంత విజయవంతమైన కార్యక్రమాలతో 1998లో బిజెపి ఢిల్లీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఈ అనుభవాలను ఆయనకు ఒక ప్రాపంచిక దృక్పథాన్ని అందించడమేకాకుండా దేశానికి సేవ చేయాలని, దేశాన్ని సామాజికంగా, ఆర్థికంగా అగ్రగామిగా తీర్చిదిద్దాలనే ఆసక్తిని ఇనుమడింపజేసింది. అక్టోబర్ 2001 లో, పార్టీ ద్వారా   నరేంద్ర మోడీ గుజరాత్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా పిలుపును అందుకున్నాడు.  నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా అక్టోబర్ 7, 2001న ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, జనవరి 2001 లో వచ్చిన భారీ భూకంపాలు మరియు అనేక ప్రకృతి వైపరీత్యాలు, దుష్ప్రభావాల కారణంగా గుజరాత్ ఆర్థిక వ్యవస్థ క్రిందకి దిగజారింది. అయితే జాతీయ మరియు అంతర్జాతీయ అనుభవం ద్వారా  నరేంద్ర మోడీ ఒక మాస్టర్ వ్యూహాకర్తగా మంచి నిర్ణయాలు తీసుకున్నారు. 


ఆయన నాయకత్వంలో గుజరాత్ విద్య, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ వంటి వివిధరంగాల్లో భారీ మార్పులను చూసింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం తనదైన స్పష్టమైన దృష్టికోణంతో విధానపరమైన సంస్కరణా కార్యక్రమాలను ప్రారంభించారు, ప్రభుత్వ పాలనా వ్యవస్థను తీర్చిదిద్దారు. తద్వారా గుజరాత్‌ను సంపన్నమార్గంలో పెట్టారు. మోడీ పాలనా సమర్థత, స్పష్టమైన దృక్పథం, వ్యక్తిత్వ పరిపూర్ణత లకు ఆయన నైపుణ్యం తోడై 2002 డిసెంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయాన్ని సాధించి పెట్టాయి. 182 అసెంబ్లీ స్దానాలున్న గుజరాత్ శాసనసభలో 128 స్దానాలను  నరేంద్రమోడీ కైవసం చేసుకున్నారు. ఇదే విజయ పరంపర 2007 ఎన్నికల్లో పునరావృతమై మళ్లీ గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది.  నరేంద్ర మోడీ 2012 సెప్టెంబర్ 17న గుజరాత్ ప్రజలు సేవలో 4000 రోజులు రికార్డును పూర్తి చేశారు.


మూడు వరుస ఎన్నికల్లో నరేంద్ర మోడీని గుజరాత్ ప్రజలు ఆశీర్వదించి, అధికారాన్ని కట్టబెట్టారు. 2002, 2007 ఎన్నికల్లో(117 సీట్లు) గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించిన శ్రీ నరేంద్ర మోడీ, 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో(115 సీట్లు) తన జోరును కొనసాగించారు. డిసెంబర్ 26, 2012వ తారీఖున వరుసగా నాల్గవసారి గుజరాత్ ముఖ్యమంత్రిగాప్రజా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.  నరేంద్ర మోడీ ఆలోచనలు, ఆదర్శాల నాయకత్వం కారణంగా యువత ఆయనను ఒక క్లాసిక్ రోల్ మోడల్‌గా భావిస్తుంది. మోడీ వ్యక్తిత్వ బలం, సాహసం, అంకితభావం, దార్శనికత సృజనాత్మక నాయకత్వం ఎలా వికసిస్తుందో తెలియజేస్తుంది. ప్రజా జీవితంలో విశేషమైన సేవాతత్పరత, ప్రయోజనకరమైన ఆచరణ గల, తాను ప్రేమించే ప్రజల ప్రేమను పొందగలిగిన ఇలాంటి నాయకుడు ప్రజాజీవితంలో కనిపించడం అరుదు.

మరింత సమాచారం తెలుసుకోండి: