తెలంగాణలో రోజు రోజుకీ రోడ్డు ప్రమాదా సంఖ్య పెరిగిపోతుంది.  మొన్న జగిత్యాల జిల్లా కొండ గట్టు వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 60 మంది చనిపోయారు.  ఆర్టీసీ చరిత్రలోనే ఇది అది పెద్ద రోడ్డు  ప్రమాదం అని అంటున్నారు.  తాజాగా ఈ ఘటన మరువక ముందు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగిఉన్న టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు.  


మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేర్యాల సమీపంలోని ఓ గ్రామంలో బంధువు అంత్యక్రియల్లో పాల్గొనడానికి   టాటా ఏస్ వాహనంలో బయలుదేరారు. గజ్వేల్ జిల్లా రిమ్మనగూడకు చేరిన తర్వాత మరి కొంత మంది బంధువుల కోసం వేచి చూస్తూ రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపేశారు. అంతలోనే మృత్యువులా ఓ లారి అక్కడ ఆగిఉన్న టాటా ఎస్ ని దారుణంగా ఢీ కొన్నది. అంతే కాదు కిందపడిన కొంత మందిని తొక్కుకుంటూ వెళ్లి కాస్త దూరంలో ఆగిపోయింది.

 

తెగిపడిన శరీర భాగాలు, రక్తస్రావంతో ఘటనా స్థలి భయానకంగా మారింది.  ఈ ప్రమాదంలో లారీ టైర్ కింద పడి నలుగురు..ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మరో వ్యక్తి మరణించారు.  పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలిస్తున్నారు. కాగా, మ్మనగూడ ప్రమాదం పట్ల మంత్రి హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: