2018 (సౌత్ ఏషియన్ ఫుడ్బాల్ ఫెడరేషన్) శాఫ్ సుజుకి కప్ ఫైనల్స్ లో ఇండియా, మాల్దీవులు జట్లు ఢీ కొట్టబోతున్నాయి. ఇప్పటికే 7సార్లు శాఫ్ టైటిల్ గెలిచిన ఇండియా ఫుట్ బాల్ జట్టు మరోసారి ఫైనల్స్ కు చేరింది. సెమీ ఫైనల్స్ లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్ తో 3-2 తేడాతో విజయం సాధించింది. 


ఈ సీరీస్ లో మాల్దీవులు జట్టు సెమీస్ లో నేపాల్ పై 3-0 తేడాతో విజయం సాధించి ఫైనల్స్ కు చేరింది. శాఫ్ చాంపియన్ షిప్ లో ఇండియా 7 సార్లు విజేతగా నిలవగా.. 3 సార్లు ఫైనల్స్ లో రన్నరప్ గా మిగిలింది. ప్రస్తుతం ఇండియా, మాల్దీవ్స్ రెండు జట్లు మంచి ఫాం లో ఉన్నాయి.


శాఫ్ లో మాల్దీవ్ జట్టు కూడా ఐదు సార్లు సెమీ ఫైనల్స్ వరకు వచ్చి వెనుదిరిగింది. ఇక 2009 శాఫ్ ఫైనల్స్ లో ఇండియా, మాల్దీవ్స్ జట్లు ఢీ కొట్టాయి. అయితే అప్పుడు ఇండియా విజయ కేతనం ఎగురవేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో శాఫ్ టోర్నీ జరుగుతుంది. 2009 కంటే ముందు 1997లో కూడా ఫైనల్స్ తో ఇండియా, మాల్దీవ్స్ జట్లు తలపడ్డాయి. అయితే అప్పుడు కూడా ఇండియానే విక్టరీ సాధించింది.  


రెండు సార్లు ఫైనల్స్ వరకు వచ్చిన మాల్దీవ్స్ జట్టు ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలనే కసితో కనిపిస్తున్నారు. అంతేకాదు ర్యాంకింగ్స్ లో కూడా ఇండియా నెంబర్ 1 లో ఉండగా.. మాల్దీవ్స్ నెంబర్ 2లో శాఫ్ టోర్నీలో మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఇక పాయింట్స్ విషయానికొస్తే 97 పాయింట్స్ తో ముందుండగా.. 70 పాయింట్స్ తో మాల్దీవ్స్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది.  


మరి శనివారం జరుగబోయే ఈ ఫైనల్ మ్యాచ్ లో ఎవరు ఫైనల్ విన్నర్ అవుతారో చూడాలి. మూడవ సారి మాల్దీవ్స్ జట్టుని ఓడించి 8వ సారి టైటిల్ విజేతగా నిలవాలని ఇండియా చూస్తుంటే.. 2008 తర్వాత టైటిల్ కోసం మాల్దీవ్స్ ఈగర్ గా ఉంది. మరి విన్నర్ ఎవరన్నది రేపటి మ్యాచ్ తో తెలుస్తుంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: