ఈ ఫ్రైడేకి ఎంతో విశేషం ఉంది. ఏపీలో ఓ రాజకీయ వంటకాన్ని బాగా ఫ్రై చేసి మసలా బాగా దట్టించిన రోజు ఇది. నాయకులు అన్నాక ఉద్యమాలు చేస్తారు, అరెస్టులు అవుతారు. కోర్టులు నోటీసులు జారీ చేస్తాయి. ఇదంతా షరా మామూలు వ్యవహారం. కానీ,  పొరుగు రాష్ట్రంలో ఎన్నికల హడావుడి రగులుగున్న టైంలో, ఏపీలోనూ ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ ఇలాంటి  చిన్న నోటీసులను కూడా  ఎలాగ పెద్దవి చేయాలో పసుపు శిబిరానికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. అందుకే బాగా ఫ్రై చేసేసారు.


ఏదో జరిగిపోయినంత బిల్డప్ :


బాబ్లీ ప్రాజెక్ట్ అక్రమ కట్టడాల పేరిట చాల కాలం క్రితం టీడీపీ ఉద్యమం అంటూ ఓ సీన్ చేసింది. అప్పట్లో ఉమ్మడి ఏపీకి రోశయ్య సీఎం గా ఉన్నారు. బాబ్లీ వద్ధ అక్రమంగా ప్రాజెక్ట్ కడతారా అంటూ తమ్ముళ్ళతో పెద్దన్నయ్య బాబు రభసకు బయల్దేరి వెళ్ళారు. సరే  అక్కడ నిషేధం ఉంది, రావద్దు అన్నా వెళ్ళారు, అరెస్టులు అయ్యారు. ఆ తరువాత కేసు మొదలైంది. 2013 నుంచి కేసు నడుస్తోంది. దానికి సంబంధించి కోర్టుకి ఎన్ని సార్లు పిలిచినా రాలేదని చెప్పి నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేశారు.  అప్పటికే ఏదో జరిగిపోతున్నట్లుగా అనుకూల మీడియా కధనాలతో హోరెత్తించేసింది. 


ఆ రెండూ వారి పుణ్యమే :


ఇంతకీ కధేంటంటే బాబ్లీ కట్టడం బాబు ఉమ్మడి ఏపీకి సీఎం గా దివ్యంగా వెలిగిపోతున్న రోజులలో  నిర్మించారు. అంటే అపుడు ఏమీ అనకుండా కట్టడాన్ని చూసీ చూడనట్లుగ వదిలేసిన పాపం బాబుదే. ఇక తెలంగాణా ఉద్యమం  రగిలిగిన తరువాత, రెండు మార్లు సీఎం కుర్చీ దక్కక ప్రతిపక్షంలోకి వచ్చాక బాబు అండ్ కోకి బాబ్లీ అక్రమ కట్టడం అని గుర్తుకువచ్చింది. ఇక కేసులు పెట్టింది ఎవరో కాదు, అప్పటి కాంగ్రెస్ సర్కారు. ఈ విధంగా చూసుకున్నపుడు ఈ వారెంట్ కి వెనక ఉన్నది టీడీపీ, కాంగ్రెస్ అంటే సబబుగా ఉంటుంది.



 చిత్రమేమిటంటే ఈ రెండు పార్టీలూ తెలంగాణాలో పొత్తు పెట్టుకుని పోటీకి దిగుతున్నాయి. అక్కడ సక్సెస్ అయితే ఏపీలోను కలుస్తారు. మరి నాడు కేసులు పెట్టిన కాంగ్రెస్ ని వదిలేసి బీజేపీ మీద ఏడవడం అంటే ఫక్త్ పాలిట్రిక్స్ కాక మరేంటి. అయినా ఇదేదో పెద్ద వ్యవహారం అయినట్లు అనుకూల మీడియా సీన్ క్రియేట్ చేస్తే ఓ సినీ నటుడు ఇంతని, అంతనీ చేస్తూ క‌ధలు చెప్పడం విడ్డూరం కాక పోతే మరేంటి.



మరింత సమాచారం తెలుసుకోండి: