ఆయన ఆషా మాషీ వ్యక్త్రి కాదు. నలభయ్యేళ్ళు రాజకీయాల్లో తల పండిన ఉద్దండ పిండం. ఎన్నో యుధ్ధాల్లో ఆరితేరిన ఘనాపాటి. ఆయనకు జాగ్రత్తలు చెప్పినా సలహాలు ఇచ్చినా తాతకు దగ్గులు నేర్పడమే. దేశం మొత్తం మీద ఎక్కడైన చీమ చిటుక్కుమంటే మొదట తెలిసేది ఆయనకే. అటువంటి పెద్దాయన గురించి  ఓ సినీ నటుడు ఈ మధ్య తెగ ఆవేశపడిపోతున్నాడు. ఆందోళన చెందుతున్నాడు, . ఇంతకీ కధ ఏంటంటే  ఆపరేషన్ గరుడ పేరిట పెద్దాయనకు ఏదో జరిగిపోతుందంట.


కామెడీగా లేదూ :


ఆపరేషన్ గరుడ అని వారం క్రితం చెప్పిన సినీ నటుడు శివాజీ  మళ్ళీ ఈ రోజు మీడియా ముందుకు వచ్చాడు. బాబ్లీ కేసుపై అక్కడి కోర్ట్ వారెంట్ అలా జారీ చేసిందో లేదో ఇలా ఈయన సీన్లోకి వచ్చేశారు అచ్చం సినిమా స్క్రిప్ట్ లాగానే. వస్తూనే నేను చెప్పలా, నోటీసులు వస్తాయని, అదే జరిగిందని అంటూ  భుజం చరచుకుంటూ తన గురించి  బాగా చెప్పేసుకున్నారు. ఆ తరువాత తాపీగా గరుడ ఆపరేషన్ లో ఇది కాదు ముచ్చట ఇంకా పెద్దదే ఉందంటూ సినిమా స్టైల్లో సస్పెన్స్ పెట్టారు శివాజీ.


చెప్పను గాక చెప్పను :


తనకు అంతా తెలుసు అంటూనే చెప్పను అనడమే శివాజీ  మార్క్ కామెడీ, నిజానికి ఓ ముఖ్యమంత్రి, జాతీయ స్థాయిలో కీలకమైన నాయకుని పదవికి, ప్రాణానికి ముప్పు ఉందని సమాచారం తెలిసినపుడు మీడియాతోనో, ఇంటలిజెన్స్ ఏజెన్సీతోనో  పంచుకోవడం బాధ్యతాయుతమైన పౌరుని విధి. అంతే కానీ  అనుకూల మీడియా ముందు చిందులేయడం, ఇంతే చెబుతాను మరేం అడగద్దు అనడం ఇదేం ఆపరేషన్ గరుడ కధో అర్ధం కావడం లేదు.


ప్రైవేట్ జెట్ వద్దుట :



బాబు గారు ఇకపై ప్రైవేట్ జెట్ లో తిరగరాదట. వెల్టే ప్రాణాలకు ముప్పు వస్తుందట.  ఆయన అసలు మహారాష్ట్ర కోర్ట్ కి కూడా వెళ్ళరాదట. అక్కడకు వెళ్తే మరిన్నికొత్త కేసులు అప్పటికపుడు బనాయించి ఆయా  కేసుల మీద వరస అరెస్టులు చేస్తారట. ఒకటి కాదు రెండు కాదు  అనేకమైన కేసులు పెడతారట. ఇక్కడ ఏపీలో సీఎం కుర్చీ లాగేసి ఏపీలో రాష్ట్రపతి పాలన తెస్తారట. ఇవన్నీ సినీ నటుడు శివాజీ మీడియా ముందు చెప్పిన మాటలు.


 ఇందులో నిజం ఉంటే నిజంగా ఏపీ ప్రజలంతా ఆందోళన పడాల్సిందే. ఇంతటి విలువైన సమాచారం పోలీసులకు ఇవ్వొచ్చుగా. సీఎం గారి గురించి అంతటి శ్రధ్ధాసక్తులు ఉంటే ఆయన భద్రతపై మీడియకెక్కి మాట్లడడం కంటే తగిన ఏజెన్సీలకు విషయం చెప్పి ముప్పు తప్పించవచ్చుగా. అబ్బే అవన్నీ మనం అడకకూడదు, ఆయన చెప్పకూడదు, అపుడపుడు ఇలా మీడియా ముందుకు వచ్చి షాకింగ్ స్టేట్మెంట్స్ ఇస్తూ హల్ చల్ చెస్తారంతే. ఏదేమైనా శివాజీ చెప్పారు కాబట్టి,  బాబు గారు బహు పరాక్. ఆపరేషన్ గరుడ ఉంది జాగ్రత్త..


మరింత సమాచారం తెలుసుకోండి: