ఏమాత్రం ఏమ‌రుపాటుతో ఉన్నా వైసిపి అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి మ‌ళ్ళీ ప్ర‌తిప‌క్ష‌మే గ‌తా ? క్షేత్ర‌స్ధాయిలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను చూస్తుంటే అదే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార తెలుగుదేశంపార్టీ అభ్య‌ర్ధుల‌కు వైసిపి అన్నీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ గ‌ట్టి పోటీ ఇచ్చే ప‌రిస్ధితి  క‌న‌బ‌డ‌టం లేదు.  


గ‌ట్టి పోటీ ఇవ్వ‌లేక‌పోయింది

Image result for 2014 elections and jagan

పోయిన ఎన్నిక‌ల్లో 175 అసెంబ్లీ నియోజ‌క‌ర్గాలు, 25 పార్ల‌మెంటు స్ధానాల్లో వైసిపి చాలాచోట్ల టిడిపికి గ‌ట్టి  పోటీ ఇవ్వ‌లేక‌పోయింద‌న్న‌ది వాస్త‌వం.  వైసిపి గెలిచింది 67 అసెంబ్లీ, 8 లోక్ స‌భ సీట్ల‌లో మాత్ర‌మే అన్న విష‌యం గుర్తుంచుకోవాలి. అందులో కూడా 23 మంది ఎంఎల్ఏలు టిడిపిలోకి ఫిరాయించేశార‌నుకోండి అది వేరే సంగ‌తి. 


నిర్ల‌క్ష్యం కార‌ణంగానే ఓడిపోయారా ?

Image result for jagan review with leaders

మొన్న విశాఖ‌న‌గ‌రంలో జ‌రిగిన కీల‌క నేత‌ల స‌మావేశంలో జ‌గ‌న్ చెప్పిన‌ట్లుగా పోయిన ఎన్నిక‌ల్లో ప‌లువురు అభ్య‌ర్ధులు నిర్ల‌క్ష్యం కార‌ణంగానే చాలా సీట్ల‌లో ఓడిపోయారు. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎటు గెలిచిపోతున్నామ‌న్న అతి విశ్వాసంతో ప్ర‌చారం కూడా స‌రిగా చేయ‌లేదు. పోలింగ్ కు ముందు రెండు మూడు రోజులు ప్ర‌తి అభ్య‌ర్ధికి చాలా కీల‌కం. ప్ర‌చారం చేయ‌క‌పోయినా, జనాలను ప‌ట్టించుకోక‌పోయినా వాళ్ళంత‌ట వాళ్ళే త‌మ‌కు వ‌ద్ద‌న్నా ఓట్లేసేస్తార‌న్న ఓవ‌ర్ యాక్ష‌నే వైసిపి అభ్యర్ధుల కొంప ముంచేసింది.

10 వేల లోపు ఓడిపోయింది 46 మంది


పోయిన ఎన్నిక‌ల్లో 10 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన వైసిపి అభ్య‌ర్ధులు 46 మంది. అందులో అనంత‌పురం జిల్లాలోనే ఆరు నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. జిల్లాలోని రాయ‌దుర్గం, రాప్తాడు, పుట్ట‌ప‌ర్తి, శింగ‌న‌మ‌ల‌, గుంత‌క‌ల్లు, అనంత‌పురం అర్బ‌న్  నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. 14 నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను వైసిపి గెలిచింది రెండు మాత్ర‌మే. పై ఐదు సిగ్మెంట్ల‌లో పోటీ చేసిన అభ్య‌ర్ధులు జాగ్రత్త‌గా ఉండుంటే మ‌రికొన్ని గెలిచేవ‌న‌టంలో సందేహం లేదు. కృష్ణా జిల్లాలో నాలుగ సీట్లు ఓడిపోయింది. అలాగే తూర్పు గోదావ‌రి జిల్లాలో నాలుగు, ప్ర‌కాశం జిల్లాలో నాలుగు, చిత్తూరు జిల్లాలో మూడు, గుంటూరు జిల్లాలో నాలుగు...ఇలా విశాఖ‌ప‌ట్నం, ప‌శ్చిమ‌గోదావ‌రి త‌దిత‌ర జిల్లాల్లో మొత్తం  46 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓడిపోయారు.


అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోక‌పోతే వేస్టే

Image result for jagan and party meeting

పోయిన ఎన్నిక‌ల్లో వైసిపి ఓట‌మికి అభ్య‌ర్ధుల్లోని లోపాలు కార‌ణం ఒకటైతే టిడిపికి అనుకూల వాతావ‌ర‌ణం రెండోది. అప్ప‌ట్లో చంద్ర‌బాబుకు అనుకూలించిన వాతావ‌ర‌ణం రేప‌టి ఎన్నిక‌ల్లో ఉండే అవ‌కాశాలు దాదాపు లేవ‌నే చెప్పాలి. మ‌రి అటువంటి  ప‌రిస్ధితుల్లో కూడా వైసిపి అభ్య‌ర్ధులు, నేత‌లు గుణ‌పాఠం నేర్చుకోకుండా మ‌ళ్ళ అవే త‌ప్పులు చేస్తే జ‌గ‌న్ కు మ‌ళ్ళీ ప్ర‌తిప‌క్ష స్ధాన‌మే గ‌తి.    


మరింత సమాచారం తెలుసుకోండి: