ఏపీలో రాజకీయం క్రమంగా మారుతోంది. ఎన్నికల వేడి మెల్లగా రగులుతోంది. పోలరైజేషన్ దిశగా అడుగులు పడుతున్నాయి. హంగులు, గందర గోళాలు లేని క్లారిటీతో కూడిన తీర్పునకు ఏపీ ప్రజలు రెడీగా ఉన్నారని లేటెస్ట్ సర్వేలు రుజువు చేస్తున్నాయి. ఇద్దరు టాప్ పొలిటీషియన్ల మధ్యనే హోరా హోరీ పోరు 2019 లో జరగబోతోందన్నది ఖాయం. ఇలాంటి ముఖాముఖీ పోరు ఎపుడు అధికారంలో ఉన్న పార్టీకి దెబ్బే. 


ఎందరు వచ్చినా ఆ ఇద్దరే :


ఏపీ సీన్లోకి ఎందరు పోటీదారులు వచ్చినా చంద్రబాబు, జగన్ ల మధ్యనే ఎన్నికల సమరం కేంద్రీక్రుతం కానుందని సర్వేలు తేల్చుతున్నాయి. బాబుకు సరి జోడు జగన్ అన్నది ఏపీ ప్రజాలు డిసైడ్ అయిపోయారు. మిగిలిన పార్టీలు రంగంలో ఉన్న విన్నింగ్ చాన్సెస్ ఉన్న పార్టీని ఎంచుకుంటే మాత్రం అవి సోది లోకి లేకుండా పోతాయి. ఇది చాల సార్లు ప్రూవ్ అయింది కూడా.


పాదయాత్రతో టాప్ :


వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఆ పార్టీకి భారీ ఎత్తున ప్లస్ పాయింట్ గా మారిందన్నది సర్వేలు చెప్పిన సత్యం. ఏపీలో అధికార పార్టీపై విరక్తి వస్తే వెంటనే ఆప్షన్ గా వైసీపీని నిలబెట్టడంలో జగన్ పూర్తిగా సక్సెస్ అయ్యారని తెలుస్తోంది. అందుకే ఇండీయా టు డే సర్వేలో జగన్ కి 43 శాత‌ భారీ మద్దతు లభింది. ముఖ్యమంత్రి చంద్రబాబు 38 శాతం ఓట్లతో వెనకబడి ఉన్నారు. మధ్యలో  వచ్చిన పవన్ పార్టీకి 5 శాతం మద్దతు దక్కడం గమనార్హం . జాతీయ పార్టీలేవీ ఎక్కడా కనిపించని పరిస్తితి ఉంది.


బలమైన పోటీ :


వచ్చే ఎన్నికలు టీడీపీ వర్సెస్ వైసీపీ కాదు, బాబు వర్సెస్ జగన్ గానే జరుగుతాయన్నది ద్రువపడిపోయిన వాస్తవం. అంటే సీఎం గా బాబు ఫెయిల్  అయితే జగన్ ని తెచ్చి కూర్చోబెడతామని ఏపీ జనం క్లారిటీతో చెబుతున్నారన్న మాట. కొత్తగా పార్టీ పెట్టిన జనసేనను అంత సీరియస్ గా జనం తీసుకోవడం లేదన్నాది సర్వే చెప్పిన మరో ఆసక్తికరమైన అంశం. మొత్తానికి ఇద్దరు బలమైన వ్యక్తుల మధ్యన ముఖా ముఖీ పోరుగా ఏపీ ఎన్నికలను మార్చడంలో జగన్ సక్సెస్ అయ్యారు.



ఇలా జరగడం వల్ల టీడీపీ నష్టపోతే జగన్ లాభపడతారు. మధ్యలో అనేక పార్టీలను పెట్టి గందరగోళం నుంచి అధికార పార్టీగ గెలుపు సాధించాలనుకుంటున్న టీడీపీ ఎత్తులు ఇప్పటికైతే పారలేదనే చెప్పాలి. ముందు ముందు ఏం జరుగుతొందో తెలియదు కానీ ఇదే విధంగా డైరెక్ట్ ఫైట్ జరిగితే మాత్రం జగన్ సీఎం కావడం ఖాయమని పొలిటికల్ పండిట్స్ కూడా అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: