వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబునాయుడుకు షాక్ త‌ప్ప‌దా ? ప‌్ర‌స్తుతం రాష్ట్రంలో ఇదే అంశంపై చ‌ర్చ జోరుగా జ‌రుగుతోంది. ఎందుకంటే, ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా మీడియా సంస్ధ‌లు నిర్వ‌హించిన తాజా స‌ర్వేలో వ‌చ్చే ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై జ‌నాలు స్ప‌ష్ట‌మైన అభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. మొత్తం 10, 650 మందితో మాట్లాడి రూపొందించిన స‌ర్వేలో చంద్ర‌బాబుకు షాక్ త‌ప్ప‌ద‌ని అర్ధ‌మైపోయింది. 43 శాతం మంది ప్ర‌జ‌లు త‌దుప‌రి ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ను చూడాల‌ని కోరుకుంటున్నార‌ట‌. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ్డ‌ది 38 శాతం  మందే కావ‌టం గ‌మ‌నార్హం. కేవ‌లం 5 శాతం మంది మాత్ర‌మే ప‌వ‌న్ వైపు మొగ్గు చూపారు. 


చాలా అంశాల‌పై వ్య‌తిరేక‌త‌


వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూప‌గ‌లిగిన అంశాలు ప్ర‌ధానంగా పారిశుధ్యం, వ్య‌వ‌సాయం, నిరుద్యోగం, ధ‌ర‌ల పెరుగుద‌ల‌, తాగునీర‌ని తేలింది. చంద్ర‌బాబు ఎక్క‌డ మాట్లాడినా వ్య‌వ‌సాయ రంగాన్ని  బ్ర‌హ్మాండంగా అభివృద్ధి చేస్తున్నామంటున్నారు. ల‌క్ష‌ల‌మందికి ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించిన‌ట్లు చెప్పుకుంటున్నారు. ధ‌ర‌ల‌ను అదుపులో పెట్టామంటున్నారు. పారిశుధ్యానికే ప్రాధ‌న్య‌త ఇస్తున్న‌ట్లు ఎన్నోసార్లు చెప్పారు. ప్ర‌తీ గ్రామానికి తాగునీరందించ‌ట‌మే త‌మ ల‌క్ష్యంగా ఎన్నోమార్లు చెప్పుకున్నారు. 


చెప్పేదొక‌టి-జ‌రుగుతున్న‌దొక‌టి


అంటే చంద్ర‌బాబు మాట‌ల‌కు,  చేత‌ల‌కు ఏమాత్రం సంబంధం లేద‌ని తేలిపోయింది. చెప్పేదొక‌టి అయితే  ఆచ‌రించేది మ‌రొక‌టి. ల‌క్ష‌లాది ఎక‌రాల్లో వ్య‌వ‌సాయం దెబ్బ‌తిన్న‌ది వాస్త‌వం. నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల‌ను అదుపులో పెట్ట‌లేక ఫెయిల‌య్యారు. నిరుద్యోగుల‌కు ఉద్యోగాలివ్వ‌క పోగా  ఉపాధి అవ‌కాశాలు కూడా మెరుగుప‌ర‌చ‌లేదు.  చంద్ర‌బాబు ప్ర‌తి నిర్ణ‌యంలోను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట్లు కొల్ల‌గొట్ట‌టంపైనే దృష్టి పెట్ట‌టంతో కొంప ముణిగిపోతోంది. నాలుగున్న‌రేళ్ళ కాలాన్ని కేవ‌లం ప్రోటోకాల్ ఎంజాయ్ చేయ‌టం  కోస‌మే ఉప‌యోగించుకున్నారు. అదే స‌మ‌యంలో పెరిగిపోయిన నేరాలు, టిడిపి నేత‌ల ధౌర్జ‌న్యాలు, మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాల్లాంట‌వి కూడా చంద్ర‌బాబు పాల‌న‌పై వ్య‌త‌రికేత పెర‌గ‌టానికి దోహ‌డ‌ప‌డిన‌ట్లు అర్ధ‌మ‌వుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: