ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో తెలుగుదేశం పార్టీపై తీవ్ర అవినీతి ఆరోపణలు అదేవిధంగా ప్రజా వ్యతిరేకత కూడా నెలకొంది. అయితే చంద్రబాబు కి ఎప్పుడు మద్దతు తెలిపే ఎల్లో మీడియా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ ప్రజా వ్యతిరేకత లేనట్టు దేశంలోనే చంద్రబాబు ప్రభుత్వం టాప్ అన్నట్టు వ్యవహరిస్తూ ఉండటం మనకందరికీ తెలిసినదే. అయితే ఎల్లో మీడియా ఎంత కాపాడిన చంద్రబాబు ప్రభుత్వం ఆయన నాయకులు చేస్తున్న అవినీతి కార్యక్రమాలు బట్టబయలు అవుతున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా సాధన సమితి కమిటీ అధ్యక్షుడు చలసాని తో పని చేసిన సినీ నటుడు శివాజీతో గత నాలుగు నెలల నుండి ఆపరేషన్ గరుడ అంటూ చంద్రబాబు అరెస్టు అంటూ పెద్ద పెద్ద డైలాగులు వెనుక ఉన్నది పచ్చ డైరెక్టర్లే అన్నది తేలిపోయింది.

Image result for chandrababu

తాజాగా ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుకి అరెస్ట్ వారెంట్ నోటీసులు అందజేసింది. అయితే కేసు తీవ్రత చూసుకుంటే ఇది ఒక సిల్లీ కేస్ అని తేలిపోయింది. ఎప్పుడైనా పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు చేసినా , అనుమతి లేకుండా మైకులు పెట్టినా , టైం దాటాక మీటింగ్లు పెట్టినా ఇలాంటి కేసులు పెడతారు . ఇలాంటి కేసులన్నీ పోలీసు స్టేషన్ స్థాయిలోనే కొట్టేస్తారు.

Related image

సాధారణంగా 500 రూపాయలు పోలీసు స్టేషన్ లో ఫైన్ కట్టి ఇంటికి వెళ్ళిపోతారు. ఇదీ ఈ కేసుకున్న తీవ్రత. దీన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు సానుభూతి పొందడానికి ఈ చిన్న కేసును పెద్ద కేసులో తనకు మద్దతు తెలిపి మీడియా ద్వారా చూపించే కార్యక్రమాలు మొదలుపెట్టశారు. అయితే మరో పక్క సోషల్ మీడియాలో కేసు తీవ్రత గురించి తెలియడంతో చాలా మంది నెటిజన్లు చంద్రబాబుపై మండిపడుతున్నారు.

Image result for shivaji chandrababu

ఒక రాష్ట్రానికి పాలకుడు అయి ఉండి బాధ్యతగల పదవిలో ఉండి ఇటువంటి చీఫ్ కేసులను చూపించుకుని రాజకీయాలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడుతున్నారు. ఇదే క్రమంలో నటుడు శివాజీ పై ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు. బాబు శివాజీ ఆపరేషన్ గరుడ కాదు...ఎక్స్ప్రెస్ కాదు...సూపర్ డీలక్స్ కాదు...ఇది ఆపరేషన్ పెరుగువడ అని ఒక నెటిజన్ శివాజీ పై ఫైర్ అయ్యారు సోషల్ మీడియాలో.




మరింత సమాచారం తెలుసుకోండి: