తెలుగు చ‌ల‌న చిత్ర సీమ‌లో న‌టుడు క‌మ్ విఫ‌ల నాయ‌కుడుగా గుర్తింపు పొందిన హీరో శివాజీ.. స‌మైక్య ఆంధ్ర సాధ‌న స మితి క‌న్వీన‌ర్‌గా ఉంటూనే.. రాజ‌కీయాలు చేయ‌డంలో దిట్ట‌గా గుర్తింపు పొందాడు. మొద‌ట్లో రాష్ట్రం స‌మైక్యంగా ఉండా లంటూ.. పెద్ద ఎత్తున మీడియా ముందుకు వ‌చ్చి కామెంట్లు కుమ్మ‌రించాడు. రాష్ట్రం స‌మైక్యంగాఉంటేనే అభివృద్ది సాధ్య‌మ‌ని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఆయ‌న ఆ ర‌కంగా రెండో ఆర్టిస్టుగా గుర్తింపు పొందాడు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న మాత్రం ఆగిపోలేదు. దీంతో అప్ప‌ట్లో మ‌ళ్లీ మౌనంగా ఉండిపోయిన శివాజీ ప్ర‌త్యేక హోదా అంశాన్ని లేవనెత్తాడు. కొన్ని రోజులు ఈ విష‌యంలో బీజేపీకి అనుకూలంగా మాట్లాడాడు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ తెర‌వెనుక ఏమైందో ఏమో.. ఆయ‌న టీడీపీకి అనుకూలంగా మారిపోయాడు. 

Image result for arun jaitly

ప్యాకేజీకి చంద్ర‌బాబు ఎలా ఒప్పుకొంటాడంటూ.. పెద్ద ఎత్తున నిన‌దించాడు. చంద్ర‌బాబు త‌న స్వార్థ రాజ‌కీయాల కోసం రాష్ట్రాన్ని తాక‌ట్టు పెట్టాడ‌ని అన్నారు. అంతేకాదు, చంద్ర‌బాబు ఇదే విష‌యంపై ఆర్తిక మంత్రి జైట్లీని స‌న్మానించేందుకు ఢిల్లీ వెళ్లిన స‌మ‌యంలో హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడిన శివాజీ..ప్యాకేజీకి చంద్ర‌బాబు ఓకే అంటే.. తాను ప్రాణ త్యాగానికైనా వెనుక‌డుగు వేయ‌న‌ని చెప్పాడు. మొత్తంగా ఈ వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టించినా.. ఆ త‌ర్వాత త‌ర్వాత శివాజీ ఏ ఒక్క స‌వాలుపైనా నిల‌బ‌డ‌క‌పోయే స‌రికి `వేస్ట్ గాడు` అనే ముద్ర ప‌డిపోయింది. ఆయ‌న సొల్లు త‌ప్ప ఏమీ చెప్ప డు! అనే వ్యాఖ్య‌లు త‌ర‌చుగా వినిపించ‌డం ప్రారంభించాయి. 


ఇక‌, ఆ త‌ర్వాతైనా.. శివాజీ ప్ర‌త్యేక హోదా కోసం నిల‌బ‌డింది లేదు. ఇటీవ‌ల ఓ రెండు నెల‌ల కింద‌ట విజ‌య‌వాడ‌లో జాగార దీక్ష చేసినా పెద్ద‌గా గుర్తింపు లేకుండా పోయింది. ఇక‌, కృష్ణా పుష్క‌రాల స‌మ‌యంలో నీళ్ల‌లోనే ఉండి ప్ర‌త్యేక హో దా కోసం జ‌ల‌దీక్ష చేస్తున్నాన‌ని చెప్పినా.. ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోగా.. కామెడీగా చూశారు. ఇలా తాను స‌రైన పంథాలో న‌డ వ‌కుండా ఇష్టానుసారంగా వ్యాఖ్య‌లు చేసిన ఫ‌లితంగా శివాజీకి ఎలాంటి గుర్తింపు లేకుండా పోయింది.

ప్ర‌త్యేక హోదా నినాదాన్ని ఆయ‌న ప‌క్కన ప‌డేశారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో శివాజీని ప‌ట్టించుకున్న వారు కూడా కోల్పోయారు. ఇక‌, ఇప్పుడు తాజాగా చంద్ర‌బాబుకు డ‌ప్పుకొడుతూ.. ఏకంగా చార్టెడ్ ఫ్లైట్‌లో తిర‌గొద్ద‌ని, కోర్టుకు వెళ్ల‌ద్ద‌ని ఆయ‌న‌కే(తాత‌కు ద‌గ్గులు నేర్పిన చందంగా) స‌ల‌హాలు ఇస్తుండ‌డం ప‌నిలేని దాస‌రి చేసిన ప‌నిలాగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: