టీడీపీ అధ్యక్షుడు కు నారా చంద్ర బాబు నాయుడు కు బాబ్లీ కేసు  విషయం లో నోటీసులు రావడం తో టీడీపీ మరీ అతిగా స్పందిస్తుంది. చంద్రబాబుకి నోటీసులు వస్తే.. ఆ నోటీసులు తెలుగు జాతికి వచ్చినట్లేనన్నది మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఉవాచ. అచ్చెన్న వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఏమనుకుంటున్నారో తెలుసా.? వద్దులెండి.. మరీ దారుణంగా వుంటున్నాయి ఆ కామెంట్లు. 

Image result for chandra babu

నాన్‌ బెయిలబుల్‌ వారెంట్ల గురించి అచ్చెన్నాయుడికి తెలియకపోతే, తెలుసుకోవడానికి టీడీపీలో చాలామంది నేతల వద్ద పూర్తి సమాచారం దొరుకుతుంది. టీడీపీకి లీగల్‌ టీమ్‌ ఎలాగూ వుంది.. ఆ టీమ్‌ మెంబర్స్‌ని అడిగితే, పూర్తి వివరాలు చెప్పేస్తారు. ఉరిశిక్ష పడ్డ ఖైదీ కూడా, పై కోర్టులో అప్పీల్‌ చేసుకోవడానికి ఛాన్స్‌ దొరుకుతుంది. అలాంటిది, నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ విషయంలో తెలుగుదేశం పార్టీ ఇంతలా 'అదిరిపడ్తోంది' అంటే.. ఈ 'అతి'పై అనుమానాలు రాకుండా ఎలా వుంటాయ్‌.? 

Image result for chandra babu

మొన్నీమధ్యనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, 'జనవరిలో ఎన్నికలు జరిగే అవకాశముంది.. పార్టీ శ్రేణులు సిద్ధంగా వుండాలి..' అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 'అలాగని జగన్‌తో ఎవరు చెప్పారు.?' అంటూ జగన్‌ వ్యాఖ్యలపై టీడీపీ ఎదురుదాడికి దిగింది. 'ఇది బీజేపీ కుట్ర.. ముందస్తు ఎన్నికల కోసం బీజేపీ, జగన్‌,  పవన్‌ కలిసి కుట్ర పన్నారు..' అన్నది టీడీపీ ఆరోపణ. 'ఎలా వస్తాయండీ ముందస్తు ఎన్నికలు.? చంద్రబాబు, తన ప్రభుత్వాన్ని రద్దు చేయరు.. కాబట్టి, చంద్రబాబుని జైల్లో పెట్టి, టీడీపీలో చిచ్చు పెట్టి.. ప్రభుత్వం కూలదోస్తారా.?' అని టీడీపీ కనుసన్నల్లో నడుస్తోన్న సినీ నటుడు శివాజీ, ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేసేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: