ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పెద్దపల్లి ఎమ్.పి. చెన్నూర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి బల్క సుమన్ తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణను విచ్చిన్నం చేయడానికి చంద్ర బాబు నాయుడు దొంగల ముఠాను ఇక్కడ దించారని ఆయన ఆరోపించారు. ఎపి నిఘా అదికారులు తెలంగాణలో క్యాంప్ ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఏమి వచ్చిందని ఆయన అన్నారు.

 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దొంగల ముఠాను ఏర్పాటు చేసి తెలంగాణకు పంపారని ఆరోపించారు. అక్రమ సంపాదన ను తెలంగాణలో ఖర్చుపెట్టి తెలంగాణను విచ్ఛిన్నం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని, ఏపి ఇంటెలిజెన్స్ అధినేత ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో టెలిజెన్స్‌ రహస్యకార్యాచరణ ఇక్కడ నడుస్తోందని, దీనిపై గవర్నర్‌, డీజీపీలకు ఫిర్యాదు చేస్తామన్నారు.

Image result for balka suman 

"టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చీకటి రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు మానుకోవాలి" అని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ హెచ్చరించారు. తెలంగాణ రాజకీయాల ను కలుషితం చేయాలని చంద్రబాబు చేస్తున్న కుట్రలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. చెన్నూర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నక్క జిత్తుల నారా బాబు. ఆంధ్ర ప్రజలకు చెందిన కోట్లాది రూపాయాలు తెచ్చి చంద్రబాబు తెలంగాణలో కుట్రలు చేస్తున్నాడు.

 

ఆంధ్రా పోలీసులు తెలంగాణలో అడ్డా పెట్టడం అనైతిక చర్య. తెలంగాణ రాజకీయాలను కలుషితం చేయాలని చూస్తున్న టీడీపీ కుట్రలపై గవర్నర్ స్పందించాలి. టీడీపీ డబ్బును పట్టుకొని పోలీసులకు అప్పజెప్తాం. బాబు ఏజెంట్లు కాంగ్రెస్‌లో ఉన్నారు. చంద్రబాబు చర్యలకు మా ప్రతిచర్య తీవ్రంగా ఉంటది. ఏబీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో 100 మందికి పైగా పోలీసులు ఇక్కడ మోహరించారు.

 Image result for ab venkateswara rao ips

ఏపీ నుంచి వందల కోట్లను ఇక్కడికి దిగుమతి చేసి గోల్‌మాల్ చేయాలని చూస్తున్నారు. నాలుగు ఓట్లు రాలుతాయనే ఆశతో కుట్రల కాంగ్రెస్‌ తో టీడీపీ జతకట్టింది. ఆంధ్ర ప్రదేశ్  పోలీసులు పచ్చ పార్టీ ఏజెంట్లుగా మారారు. ఏదైనా జరగరాని సంఘటన జరిగితే దానికి బాధ్యత చంద్రబాబు దే. తెలంగాణను విఫల రాష్ట్రంగా చిత్రీకరించడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని బాల్క సుమన్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: