శాఫ్ చాంపియన్ షిప్ 2018 లో అనుకున్నట్టుగానే 2008 నాటి పరిస్థితి పునరావ్రుతమైంది. ఇండియా వర్సెస్ మాల్దీవ్స్ మధ్య జరిగిన ఫైనల్ పోటీలో 1-2 తో ఇండియా చేజేతులా మ్యాచ్ ఓడిపోయింది. 1997, 2009లో ఇండియా మాల్దీవ్స్ ఫైనల్స్ పోరులో ఇండియా విజేతగా నిలవగా 9 ఏళ్ల తర్వాత మాల్దీవ్స్ ఇండియాపై విజయం సాధించింది.


శాఫ్ చాంపియన్ షిప్ 2018లో మొదటి నుండి హాట్ ఫేవరేట్ గా ఉన్న మాల్దీవ్స్ జట్టు ఇండియాను ఓడించి టైటిల్ గెలుచుకుంది. 2008లో ఫైనల్స్ లో తలపడిన ఇండియా, మాల్దీవ్స్ జట్టులో అప్పటి విజయాన్ని మళ్లీ పునరావ్రుతమయ్యేలా చేసుకుంది. గ్రూప్ బీ నుండి ఫైనల్స్ కు చేరిన ఇండియా, మాల్దీవ్స్ జట్లలో తుది పోరులో ఇండియాపై మాల్దీవ్స్ జట్టు విజయం సాధించింది. 


ఇండియా జట్టు ఇంకాస్త కష్టపడి ఉంటే బాగుండేది కాని ఈసారికి రన్నరప్ గా నిలబడటం మాత్రమే జరిగింది. మాల్దీవ్స్ జట్టు మాత్రం మొదటి మ్యాచ్ నుండి కప్ గెలిచే దాకా గట్టి పోటీ ఇచ్చింది. 2018 హాట్ ఫేవరేట్ గా ఉన్న మాల్దీవ్స్ జట్టు ఇండియా మీద 2-1 తో ఫైనల్ విన్నర్ గా నిలిచి సత్తా చాటింది.



మరింత సమాచారం తెలుసుకోండి: