తాజాగా ఇటీవల ఏపీ సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ వారెంట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ పరిణామంతో తెలుగుదేశం పార్టీ నేతలు...టీఆర్ఎస్ నేతలపై మండిపడుతున్నారు. చంద్రబాబుకు నోటీసులు రావడం వెనుక కేసిఆర్ హస్తం ఉందని ఇష్టమొచ్చిన రీతిలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన టిడిపి నాయకులు...మాట్లాడారు.

Image result for chandrababu

ఈ పరిణామంతో టీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..టిడిపి నాయకులకు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పై కుట్రపనల్సిన అవసరం టిఆర్ఎస్ పార్టీకి లేదని పేర్కొన్నారు. అసలు ఆ నోటీసులు కి కెసిఆర్ కి సంబంధం ఏమిటి అంటూ టిడిపి నాయకులను ప్రశ్నించారు. అసలు ఆ కేసు(బాబ్లీ సంఘటన) కాంగ్రెస్ హయాంలో జరిగినదని, అప్పటి ప్రభుత్వంలో కేసులు పెడితే దానికి టీఆర్ఎస్ పై ఆరోపణలు చేయటం తగదని ఆయన మండిపడ్డారు.

Image result for talasani srinivas yadav

బాబ్లీ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు విరుద్ధంగా కాంగ్రెస్ తో టీడీపీల పొత్తు పెట్టుకుందని దుయ్యబుట్టారు.టీడీపీ – కాంగ్రెస్ పొత్తు ఆరు నెలల క్రితమే కుదిరిందని ఆయన మీడియాతో అన్నారు. పొత్తు పర్యవసానాలను చంద్రబాబు రాబోయే రోజుల్లో అనుభవిస్తారని అన్నారు. తాజాగా చంద్ర బాబు పెట్టుకున్న పొత్తుతో టీడీపీ పతనం ప్రారంభమైందని అన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్...దీంతో ఈ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద హాట్ టాపిక్ గా మారాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: