కెసిఆర్‌ ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలకు సిద్ధమైయ్యారని బిజేపి జాతీయ అధ్యక్షులు అమిత్‌షా అన్నారు.మోడి జమిలి ఎన్నికలకు ప్రయత్నిసుంటే మద్దత్తు తెలిపిన కెసిఆర్‌ తెలంగాణలో ముందస్తుకు ఎన్నికలకు వెళ్ళినందుకు దానిపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.



తెలంగాణ విమోచన దినం నిర్వహించకుండా రజాకర్ల ను తలపించేలా ఎంఐఎం కు సహకారం ఇస్తుందన్నారు. ఒక్కరి కోసం తెలంగాణ సమాజాన్ని అగౌరవపరుస్తారా?  అని ప్రశ్నించారు. శనివారం పాలమూరు పట్టణంలో నిర్వహించిన ఎన్నికల శంఖారావంలో అయన పాల్గొని సభను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో బిజేపి ప్రభుత్వం ఏర్పాటు కావటం ఖాయ మన్నారు.



"రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు ఎలాంటి సంకీర్ణాలైనా ఏర్పడొచ్చు"  ఏ పొత్తు ఎటుదారి తీస్తుందో చెప్పలేం. తెలంగాణాలో కొత్తగా "కాంగ్రెస్‌-టీడీపీ పొత్తు" ఒక గొప్ప ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది. ఇక్కడ సిద్ధాంతాలు విధానాలు ఉత్త బోగస్ అంటారు ప‌రిశీల‌కులు. 2018 తుది వరకు ముందస్తు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని భావిస్తున్న తరుణం లో తెలంగాణాలో రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. 
Image result for amith shah in mahboobnagar meeting
"ఎన్నిక‌ల్లో గెలుపు అధికారం స్వంతం చేసుకోవటం" ప్రధాన లక్ష్యంగా ప్ర‌స్తుతం అధికార పార్టీ టీఆర్ఎస్ తన శక్తి యుక్తులు ఐఖ్యం చేసి తన చతురంగ బలాలు అంటే అంగ, అర్ధ, అధికార, వ్యూహాలను కేంద్రీకరించి రణరంగంలో ముందుంది. 
Image result for telangana official family
అదే స‌మ‌యంలో "తెలంగాణ ఇచ్చింది మేమే!" అని ప్రచారంతో ఉధ్యుక్తమౌతున్న కాంగ్రెస్ మ‌రింత‌గా అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇరు పార్టీల మ‌ధ్య "రసవత్తర సమరం"  కొనసాగనుందని విశ్లేషకుల భావన.  
Related image
రాష్ట్రంలో బీజేపీ ఉన్నప్ప‌టికీ దీని ప్ర‌భావం పెద్ద‌గా క‌నిపించే అవకాశాలు లేవంటున్నారు. కాని "ఎం ఐ ఎం మూలాలన్నిటా రజాకార్ సంస్కృతే నిండి ఉంది" అలాంటి ఎం ఐ ఎం తో పొత్తు స్నేహం కలిగిన తెలంగాణ రాష్ట్ర సమితి - రాష్ట్రంలో "ముందస్తు ఎన్నికలు" రణక్షేత్రంలో అందరి కంటే ముందుగా దూకిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 
Image result for congress tdp alliance in telangana
ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నిన్న శనివారం తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భం గా హైదరాబాదు లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై, ప్రతిపక్ష కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించి తమ బిజేపి కూడా తక్కువేమీ తినలేదని  "తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు మా తోడ్పాటును తక్కువ అంచనా వేయొద్ధని" తన వాగ్ధాటి తో సంచలనం సృష్టించారు. ఎన్నికల్లో ఓటమి భయం, అందుకే ముందస్తు ఎన్నికలని - బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. అమిత్ షా మాట్లాడుతూ:
Image result for amith shah in mahboobnagar meeting
*తెలంగాణలో అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది.
*జమిలి ఎన్నికలను మొదట సమర్థించిన కేసీఆర్ అనూహ్యంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రజలపై వందల కోట్ల భారం వేశారు. ఇవి అవకాశవాద రాజకీయాలు కాదా..?
*తన కుటుంబ సభ్యులకోసమే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని అందరికీ తెలుసు.
*కేసీఆర్ పాలన చూసిన తర్వాత టీఆర్ఎస్ మళ్లీ గెలుస్తుందని ఎవరూ భ్రమించట్లేదు. 
*"ఎంఐఎం" తో పొత్తుపెట్టుకుంటున్న కేసీఆర్ తెలంగాణను మళ్లీ రజాకార్ల వారసుల చేతుల్లో పెట్టి రజాకార్ల పాలన" తీసుకురావాలని అనుకుంటున్నారా?  
Image result for amith shah in mahboobnagar meeting
* రెండు లక్షల 'డబుల్ బెడ్రూం ఇళ్లు' ఇస్తామన్న హామీ ఆచూకి ఏమైంది? కనీసం కేంద్రం ప్రభుత్వం చేపట్టిన "ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకం" కూడా కేసీఆర్ పాలనలో అమలు చేయలేకపోయారు.
* మూడనమ్మకాలతో కేసీఆర్ సచివాలయానికి వెల్లకపోవడం ప్రజాస్వామ్యంలో సబబేనా? పాలనను మద్య యుగాల వైపు నడిపిస్తూ అరాచకం సృష్టించాలను కుంటున్నారా? 
* దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న ఉధ్యమ కాలం నాటి కేసీఆర్ హామీ ఏమైంది? కనీసం ఈ ఎన్నికల్లోనైనా ఆ హామీని నెరవేరుస్తారా? 
* ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులను ప్రపంచ స్థాయి హాస్పిటల్స్ గా చేస్తామన్న కేసీఆర్ ప్రకటన గంగ పాలేనా? 
* "నేరెళ్ల ఇసుక మాఫియా" ను ప్రశ్నిస్తే దళితులను వేధించారు. ఇదేనా దళిత సంక్షేమమంటే?  
* పండించిన పంటలకు మద్దతు ధర అడిగిన రైతులకు ఖమ్మంలో బేడీలు వేయించారు అది నిజం కాదా?
Image result for amith shah in mahboobnagar meeting
*టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనలో 4,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం దారుణం కాదా?
*టీఆర్ఎస్ తో మేము ఏరూపం లోను ఎలాంటి పొత్తు పెట్టుకోబోమని తెలంగాణ ప్రజలకు స్పష్టం చేసిన ఆయన తెలంగాణ ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వంతో పోరాడాం, పోరాడుతున్నాం.
Image result for amith shah in mahboobnagar meeting
* ఎన్నికల సమయంలో ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు నాలుకమడతేసి అసత్యప్రచారానికి తెరతీశారు. ఏపిలో చీమ చిటుక్కుమన్నా చంద్రబాబు కు అరెస్ట్ వారెంట్ వచ్చినా దాన్ని వెనుక బీజేపీకి ఉందన్న ప్రచారంతో మాకు ఏమాత్రం సంబంధం లేదు
* చంద్రబాబుపై కేసు నమోదు చేసిన కాంగ్రెస్ తో ఇప్పుడు పొత్తు పెట్టుకోవటంలోని ఆంతర్యమేమిటి? 
* తెలుగువారు అంజయ్య, పీ.వీ.నరసింహారావుకు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని ప్రజలు ఇంకా మరిచిపోకముందే అదే పార్టీతో చంద్రబాబు పొత్తుపెట్టుకోవటం అపవిత్ర పొత్తు కాదా? 
* తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకారం ఇంతకాలం అందించిన మేము ఈసారి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలను తమ ఓటు బీజేపీకే వేసి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం.
Image result for amith shah in mahboobnagar meeting
ఓవైసీ సోదరులపై అతి సామాన్యులను నిలబెట్టి గెలిపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌లో బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడు తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చిందని దుయ్యబట్టారు. మిగులు బడ్జెట్‌ లో ఉన్న ప్రభుత్వాన్ని రెండు లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి తోసేశారని, ఎంఐఎం పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. 
Image result for owaisi brothers
ఎంఐఎం ను టీఆర్‌ఎస్‌ ఆదరిస్తున్నదున దానికి  పాముకు పాలు పోసిన తీరు  భవిష్యత్ లో అర్ధం చేసుకుంటుందని - ఇప్పటికే కాంగ్రెస్‌ ఎంఐఎం ను పెంచి పోషించి వాళ్ళ దురాగతాలని ఏదిరించలెదదని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ కు గాని, కాంగ్రెస్‌ కు గాని ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్టేనని ఆయన చెప్పారు. వాల్మికీ, బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని, ఆర్థికం గా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన హామీఇచ్చారు. కాంగ్రెస్‌ కోటలు, టిఆర్‌ఎస్‌ గడీలు కూల్చుతాం మత తత్వ పార్టీలకు బుద్ధి చెప్పేది బిజెపినే  తెలంగాణా శంఖారావం సభలో లక్ష్మణ్‌ చెప్పారు. 
Image result for amith shah in mahboobnagar meeting
ఎం ఐ ఎం అవసరమైతే దొడ్దిదారిన అధికారంలోకి రావాలని చూస్తున్న విషయం ఈ మధ్య అక్బరుద్ధీన్ ఒవైసి బహిరంగంగానే వ్యక్తం చేయటం చూస్తే అది ఏ పార్టీతోనైనా ఎన్నికల తరవాతైనా కలసి అధికారంలోకి  రావటానికి ప్రయత్నిస్తుందని కిషన్ రెడ్ది జోస్యం చెప్పారు. మతపరమైన రిజర్వేషన్లను తాము నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నా మని, తెలంగాణలో పాలన ఇప్పుడు "ఆ నలుగురు" చేతుల్లోనే నలిగిపోతోందని దొరల పాలనగా లక్ష్మణ్‌ అభివర్ణించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: