ఎపుడెవరొ ఏ పార్టీలో ఉంటారో చెప్పడం కష్టమైపోతోంది. ఎన్నికల టైంలో జంపింగులు ఓ రేంజిలో ఉంటున్నాయి. హామీ దక్కితే చాలు జెండా ఎత్తేస్తున్నారు. వెళ్ళేముందు పార్టీపై దుమ్మేసి మరీ పోతున్నారు. ఇది అన్ని పార్టీల్లోనూ కామన్ అయిపోఇంది. లేటేస్ట్ గా  విశాఖ జిల్లాలో టీడీపీకి కూడా భారీ షాక్ తగిలింది.


గట్టి నేత జంప్ :


విశాఖ జిల్లాలో టీడీపీకి గట్టి నేతగా పేరున్న సుందరపు విజయకుమార్ జెందా ఎత్తేస్తున్నారు. ఆయన సుదీర్ఘకాలం పాటు టీడీపీకి ఎంతో సేవ చేశారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా అలుపెరగని పోరాటమే చేశారు. అసలు సైకిల్ పార్టీ మళ్ళీ గెలుస్తుందా అన్న డౌట్ ఉన్న టైంలోనూ ఒళ్ళొంచి పనిచేశారు. అటువంటి నాయకుడికి 2014లో టికెట్ ఇవ్వకుండా టీడీపీ మోసం చేసింది. పోనీ వచ్చేసారి అయినా గ్యారంటీ ఉందా అంటే అదీ లేదు. దాంతో ఆయన జంప్ చేయాలనే డిసైడ్ అయ్యారు.


జనసేనలోకి :


ఈ మధ్యన  జనసేనాని  పవన్ కళ్యాణ్  ని కలసిన విజయకుమార్ పార్టీలోకి చేరుతున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. ఎలమంచిలిలో కీలకమైన నాయకునిగా ఉన్న ఆయనను పవన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. దాంతో రేపో మాపో పసుపు కండువా పక్కన పడేసి జనసేనలోకి పోవడం ఖాయంగా కనిపిస్తోంది 


హై కమాండ్ తప్పే :


క్యాడర్ సైతం ఈ విషయంలో విజయకుమార్ ని సపోర్ట్ చేస్తోంది. స్థానికుడైన ఆయన్ని కాదని 2014లో కాంగ్రెస్ నుంచి జంప్ చెసిన పంచకర్లకు టికెట్ ఇచ్చారని, అయినా ఓర్చుకుని అప్పట్లో పార్టీ గెలుపునకు పని చేశారని గుర్తు చెస్తున్నారు.  మళ్ళీ ఈసారి అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారని ఆరోపించారు. అందుకే తామంతా కలసి పార్టీ మారిపోతామని అంటున్నారు. మరి కీలక నేత జంప్ అయితే ఇక్కడ సైకిల్ కి పంచర్ పడ్డట్లే.



మరింత సమాచారం తెలుసుకోండి: