పేద రాష్ట్రం.. బీద అరుపులు, ఖర్చు మాత్రం పదింతలు, దుబారాగా తగలెయ్యడంలో ఏపీ సర్కార్ అందరినీ మించిపోయింది. పైసా పైసా పేదవాడు పన్ను కడుతూంటే పాలకులు వాటిని ఇష్టం వచ్చినట్లుగా ఎడా పెడా వాడేస్తున్నారు.  ఇదేం పధ్ధతి  అని పొరపాటునా ఎవరైనా అడిగితే చాలు వారు అభివ్రుధ్ధి నిరోధకులైపోతారంతే.


డిజైన్లకే కోట్లు :


విభజన జరిగి అయిదేళ్ళు దగ్గరవుతోంది. ఓ వైపు శాశ్వత భవనం అని ఒక్కటి కూడ లేదు. అంతా తాత్కాలికమే. కానీ వాటికి పెట్టే ఖర్చే చుక్కలను దాటేస్తోంది. అమరావతి రాజధాని ఎలా ఉండాలంటూ దిజైన్ల మీద డిజైన్లు వేయిస్తున్న బాబు సర్కార్ వాటిని ఇలా చూసి అలా పక్కన పెట్తేస్తోంది. నచ్చలేదంటూ మళ్ళీ కొత్త డిజైన్లను తెమ్మంటోంది. ఇదంతా బాగానే ఉంది కానీ నచ్చని డిజైన్లకు కూడా కోట్లను చెల్లిస్తూ ఖజానా సొమ్మును గుల్ల చేసెస్తోంది. 


హైకోర్ట్ డిజైన్ల కోసం :


ఇక హైకోర్ట్ డిజైన్ల సంగతి తీసుకుంటే మాకీ అసోసియేట్స్ తయారు చేసిన డిజైన్ల కోసం 95.2 కోట్ల రూపాయలు చెల్లించేందుకు సర్కార్ ఒప్పందం చేసుకుంది. తీరా డిజైన్లు చూసాక అవి చండీగడ్  అసెంబ్లీ భవనంలా ఉన్నాయని సొడ్డు పెట్టిన సర్కార్ పెద్దలు వాటిని తిరస్కరించారు. కానీ మాకీ అసోసియేట్స్ కి ఖర్చులుగా ఏకంగా 1.15 కోట్ల రూపాయలను చెల్లించారు. వద్దన్న డిజైన్లకు ఇన్ని కోట్లు ఇవ్వడమేంటని ఆడిట్ శాఖ అభ్యంతరం పెడిత కానీ ఈ విషయం వెలుగు చూడలేదు. ఇలాగే అరిహంత్, ఇండో ఆఫ్రికన్ ఇంఫ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ సంస్థల్తో పాటు మరో సంస్థకు కూదా 13 కోట్ల రూపాయలను చిల్ల పెంకుల్ల సర్కార్ చెల్లించిందని ఆడిట్ అబ్జక్షన్ పెట్టింది.


అక్కడా రెట్టింపు సొమ్ము :


రాజధానిలో భవనాల నిర్మాణానికి 53.74 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సర్కార్ టెండర్లు పిలిసే 103 కోట్లకు టెండర్ వేసిన వారికి టెండర్లు ఖరారు చేయడాన్ని కూడా ఆడిట్ శాఖ అభ్యంతరం పెట్టిందని అంటున్నారు. ఇలాగైతే ప్రజల సొమ్ము ఎంతలా దుర్వినియోగం  అవుతోందని నెట్ జన్లు కౌంటర్లేస్తున్నారు.  మొత్తానికి రాజధాని  నిర్మాణం కాదు కానీ  వందల కోట్లకు మాత్రం రెక్కలు వస్తున్నాయని అంటున్నారు. బాబా మజాకా అని సెటైర్లూ పడుతున్నాయి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: