రాహుల్ ను అందరూ పప్పు పప్పు అని అందరూ అంటుంటారు. అయితే నిజంగా రాహుల్ మాట్లాడే మాటలు అలాగే ఉంటున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాం అనే సంగతిని నివేదించడానికి కట్టగట్టుకుని రాహుల్ వద్దకెళ్లి ఆయనకు నివేదించి వచ్చారు. తెలంగాణ ఎన్నికల పోరాటానికి ఆయన అనుమతి తీసుకుని వచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ కు కూడా స్వతహాగా పెద్ద బలంలేకపోగా.. ఇతర పార్టీలతో పెట్టుకునే పొత్తుల మీద ఆధారపడే వారు పోరాటానికి సిద్దం అవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఏయే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నామో, పొత్తు వాతావరణం ఎలా ఉన్నదో రాహుల్ కు వివరించడానికి వారు ఢిల్లీ వెళ్లారు.

Image result for rahul gandhi

అయితే ఢిల్లీలో పార్టీ నేతల సమావేశంలో రాహుల్  మాట్లాడుతూ.. తెలంగాణలో కనీసం వందసీట్లు సాధించాలనేది టార్గెట్ గా పెట్టుకోవాలని పార్టీకి దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. వందసీట్లు అంటే ఎలా వస్తాయి? అసలు రాహుల్ కు తెలంగాణలో మొత్తం ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయో తెలుసా? అని నాయకులే విస్తుపోతున్నారు. కనీసం క్షేత్రస్థాయి వివరాలు తెలుసుకోకుండానే.. రాహుల్ తోచిన మాటలు చెప్పేసి.. వచ్చిన నాయకులను ఇంటికి పంపేస్తున్నారంటూ విమర్శలు కూడా వస్తున్నాయి.

Image result for rahul gandhi

తెలంగాణలో మొత్తం ఉన్నదే 119సీట్లు. అందులో 89సీట్లలో ప్రస్తుతం తెరాస తిష్టవేసి ఉంది. పొత్తులతో ఆ పార్టీని ఎదుర్కోదలచుకుంటున్న కాంగ్రెస్.. కనీసం 90సీట్లలో పోటీచేయాలని భావిస్తోంది. అయితే తెదేపా, తెజస, సీపీఐ లాంటి పార్టీలన్నీ ఎక్కువ సీట్లకోసం గట్టిగా పట్టుపడుతున్న నేపథ్యంలో.. 71 సీట్లకు మించి పోటీచేయడానికి కాంగ్రెస్ కు అవకాశమే కనిపించడం లేదు. అలాంటి నేపథ్యంలో ఆ పార్టీ అసలు ఎన్ని విజయాలు సాధిస్తుంది? 100 సాధించాలని రాహుల్ టార్గెట్ పెట్టడం అంటే.. ఆయనకు అసలు ఇక్కడి లెక్కలు తెలుసా అని పలువురు 

మరింత సమాచారం తెలుసుకోండి: