ఎవరెంత రాజకీయం చేసినా అందులో ఎంతో కొంత సిధ్ధాంతబద్ధత కనిపించాలి. అలా చూసుకున్నపుడు ఇప్పటికీ ఓ విధానానికి కట్టుబడి ఉన్న పార్టీలుగా వామపక్షాలకు పేరు ఉంది. అయితే గత కొద్ది కాలంగా ఆ పార్టీలు చేస్తున్న రాజకీయ విన్యాసాలు చూస్తూంటే అంతా ఒక్కటేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏ రోటి కాడ ఆ పాట పాడడంలో కామ్రెడ్స్ కూడా ఆరితేరిపోయారా అనిపిస్తోంది.


మహా కూటమి :


మహా కూటమికి కొత్త భాష్యం కామ్రెడ్స్ చెబుతున్నారు. నిజానికి ఎక్కడైనా మహా అంటే బలమైన కూటమి ఏర్పాటు చేయాలంటే ప్రధాన ప్రతిపక్షం కలుపుంటేనే అది సాధ్యమయ్యేది. మరి ఏపీ విషయానికి వస్తే వైసీపీ లేకుండా చిన్నా చితకా పార్టీలతో మహా కూటమి అని వామపక్షాలు చెప్పుకుంటున్నాయి. ఇందులో జనసేన తప్ప, మిగిలిన పార్టీలకు ఏపీలో ఉనికే పెద్దగా లేదు. అయితే జనాలను మభ్యపెట్టడానికో మరెందుకో కానీ కూటమిలోని పార్టీలు అంటూ పెద్ద లిస్టే ఎర్రన్నలు చదువుతున్నారు.


అక్కడలా :


తెలంగాణాలో మాహా కూటమి ఏర్పాటు చేసినపుడు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కీలక పాత్రధారిగా  ఉంది. అందులో టీడీపీ సీపీఐ వంటి మిగిలిన పార్టీలు చేరాయి. అంతా కలసి ఇపుడు అధికారంలో ఉన్న టీయారెస్ ని దించడానికి జనంలోకి వెళ్తున్నారు. బాగానే ఉంది. మరి అక్కడ ఒకలా చేసి ఏపీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం కామ్రెడ్స్ ఇలా చేయడమేంటన్న సందేహాలు వస్తున్నాయి. ఇక్కడ మాత్రం అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీకి వ్యతిరేకంగా కూటమి కడతారట. ఎందుచేతనంటే ఈ రెండు పార్టీల విధానాలూ ఒక్కటేనట.


ఆ చాన్స్ ఇచ్చారా :


ఏపీలో ఇంతవరకూ టీడీపీ పాలన మాత్రమే జనం చూశారు, వైసీపీ ఇంకా పవర్లోకే రాలేదు. మరి అలాంటపుడు రెండు పార్టీలనూ ఒకే గాటకు కట్టేసి  కామ్రేడ్స్ ఎలా యుధ్ధం చేస్తామని ప్రకటిస్తారన్నది డౌట్. తెలంగాణా సీన్ చూస్తే అక్కడ మహా కూటమిలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ పాలన కూడ జనం చూశారు. ఆయినా ఆ పార్టీలతో జత కట్టి సమరానికి సై అంటున్న ఎర్రన్నలు ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం ప్లేట్ ఫిరాయిస్తున్నారు. 


వక్ర బుధ్ధేనా :


ఏపీకి వచ్చేసరికి కులపరమైన ఈక్వేషన్లు ఎవో అడ్డువచ్చాయని అనుకోవాలేమో. ఎంత కాదనుకున్నా కామ్రెడ్స్ లో పెద్దన్నలు  ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ వారు అంతా ఒక్కటే సామాజిక వర్గం వారు కావడం వల్లనే ఇక్కడ కాసింత సాఫ్ట్ కార్నర్ తో పోతున్నారని చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి. వాటిని నిజం చేసేలాగానే మాహ కూటమి అంటూ ఒట్ల చీలిక ప్రొగ్రాం ని తెలెత్తుకున్నారని పొలిటికల్ పండిట్స్ అంటున్నారు. ఏది ఎలాగున్నా దేశంలో లేని వింత వంటకాన్ని మన కామ్రెద్స్ ఏపీలో తయారు చెస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం లేని పక్షపాత కూటమిని వండుతూ ఉప్పేయడం మరచిపోయారు. జనాలకు అన్నీ తెలుసన్న విషయాన్ని  ఇక్కడ విస్మరించడం కొస మెరుపు.



మరింత సమాచారం తెలుసుకోండి: