ఆయన పార్టీకి చేస్తున్న రిపేర్లతో నేతలు పరేషాన్ అవుతున్నారు. ఇంతకాలం అధినాయకుడికి ఏమీ తెలియవని అనుకుంటూ టైం పాస్ చేస్తున్న లీడర్లకు గట్టి ఝలక్ ఇస్తూ తీసుకుంటున్న  డెసిషన్లతో నేతీశ్రీలకు బుర్ర హీటెక్కిపోతోంది. తామే కింగులమని భావించే వారందరికీ నేలకు దింపే ప్రోగ్రాం ఇపుడు వైసీపీలో యమ జోరుగా సాగుతోంది.


ఇంచార్జ్లకు షాక్ :


వైసీపీ ఇంచార్జ్ లకు జగన్ షాకులు ఇచ్చేస్తున్నారు. రేపటి ఎమ్మెల్యే క్యాండిడేట్లం తామే అని ఆశపడుతున్న వారికి గట్టి దెబ్బే తగులుతోంది. జగన్ మార్క్ పాలిట్రిక్స్ కి అంతా విలవిల్లాడుతున్నారు. విశాఖ జిల్లాలో లేటేస్ట్ గా చేస్తున్న మార్పు చేర్పులతో పలువురు ఇంచార్జ్లకు గుండె దడ పట్టుకుంది. తమ గతేం కానో అన్న బెంగ తో సతమవుతున్నారు.


దక్షిణ ఆయనకే:


ఈ మధ్యనే పార్టీలో కొత్తగా చేరిన విశాఖ  సిటీకి చెందిన ఓ డాక్టర్ గారికి విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇంచార్జ్ బాధ్యతలు జగన్ అప్పగించేశారు. దాంతో ఇంతకాలం అక్కడ ఆ పదవిలో ఉన్న కోలా గురువులు టికెట్ కి టిక్కు పెట్టేశారని అంటున్నారు. ఇప్పటికి రెండు మార్లు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేసి ఓడిన గురువులుకు మళ్ళీ టికెట్ లేదన్న మాటను జగన్ అలా చెప్పకనే చెప్పేసారంటున్నారు.


ఉత్తరం అదే కధ :


ఉత్తర నియోజకవర్గంలోనూ  ముగ్గురు ఇంచార్జ్లకూ షాక్ ఇచ్చేలా కొత్త వారిని అక్కడ బరిలోకి జగన్ దింపారు. బిల్డర్ గా ఉన్న కె కె రాజును ఎమ్మెల్యే కాండిడేట్ గా పోటీకి పెడతారని అంటున్నారు. దీంతో ఇక్కడ ఆశపడ్డ వారంతా తెర వెనక్కుపోయారు. ఇలాగే మరిన్ని చోట్ల కూడా మార్పులు, చేర్పులు చేసేందుకు జగన్ రెడీ అయిపోతున్నారు.


ఆ రెండూ అంతేనా :


ఇక సిటీ పరిధిలోకి వచ్చే పెందుర్తి, భీమిలీ సీట్లలో కూడా కొత్త వారే రేపటి ఎమ్మెల్యే అభ్యర్ధులుగా తెర ముందుకు వస్తారని టాక్ నడుస్తోంది. పెందుర్తిలో అదీప్ రాజ్ ఇంచార్జ్ గా ఉన్నా అక్కడ చొక్కాకుల వెంకట రావుకే టికెట్ కన్ ఫాం అయిందని అంటున్నారు. భీమిలీలో విజయనిర్మల ఇంచార్జ్ గా ఉన్నా బొత్స ఫ్యామిలీ నుంచి ఒకరిని బరిలోకి దింపుతారని చెబుతున్నారు. రూరల్ జిల్లాలోనూ చాల చోట్ల మార్పులు ఉంటాయని వైసీపీలో టాక్ నడుస్తోంది. మొత్తానికి జగన్ పాదయాత్రతో పాటు పార్టీ రిపేర్లూ చేస్తూడడంతో నేతాశ్రీల్లో కంగారు మొదలైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: