అమిత్ షా తెలగాణ లో పర్యటించి విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసిన సంగతీ తెలిసిందే. ఆ మాటకొస్తే.. అమిత్ షా.. ఇలాంటి ప్రసంగాలు చేయడం ఇవాళ కొత్తకాదు. కేవలం ‘హిందూ’ ఓటు బ్యాంకును మాత్రమే నమ్ముకుని మనుగడ సాగిస్తున్న భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షుడు అయిన అమిత్ షా అలా తప్ప మరోరకంగా మాట్లాడగలరని అనుకోవడం కూడా భ్రమ. పరిస్థితులు ఇలా ఉండగా... ఈ పరస్పర విద్వేష ప్రసంగాలు కాస్తా సవాళ్ల రూపం సంతరించుకుంటున్నాయి.

సవాలు స్వీకరించే దమ్ము లేదు గానీ...

దమ్ముంటే అమిత్ షా వచ్చి హైదరాబాదులో తన మీద పోటీచేయాలంటూ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఒక సవాలు విసిరారు. ఈ సవాలును భాజపా స్వీకరిస్తుందని అనుకోవడం కూడా భ్రమే. కాకపోతే.. దానికి ప్రతిసవాలు విసురుతున్నట్లుగా.. ఒవైసీ స్థాయికి అమిత్ షా అక్కర్లేదని.. ఒక సామాన్య కార్యకర్తను హైదరాబాద్ ఎంపీ బరిలో దింపి, గెలిపిస్తాం అని రాష్ట్ర భాజపా అంటోంది. ఇదంతా భాజపా పలాయన వాదంలాగానే కనిపిస్తోంది.

Image result for amith shah

ఒక సంగతి గమనించాల్సి ఉంది. మజ్లిస్ చాలా స్పష్టంగా తమది ముస్లిం మతానికి పరిమితమైన పార్టీ అన్నట్లుగానే ప్రచారం చేసుకుంటూ ఉంటుంది. మరి భాజపా సంగతి అదికాదు కదా. తమది కేవలం హిందువులకు మాత్రమే పరిమితమైన పార్టీ అని వారు చెప్పట్లేదు కదా. అలా చెప్పుకోగలిగే సత్తా వారికి ఉందా? అనేది కూడా ఇక్కడ మీమాంస. అలా చెప్పుకోలేరు.. కానీ అలవాట్లు అవే.. బయటకు కూడా చెప్పుకుంటే సర్వభ్రష్టత్వం చెందుతాం అని భయం. బలాల విషయానికి వస్తే.. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంతవరకు భాజపాకు ఎంత బలం ఉన్నదో, మజ్లిస్ కు కూడా అంతేబలం ఉంది. కాకపోతే మజ్లిస్ గెలవగలిగినన్ని స్థానాలు కూడా భాజపాకు గెలుచుకోవడం సాధ్యంకాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: