తెలంగాణ లో భారీ భహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించినప్పుడు చాలా మందికి చాలా సందేహాలు వచ్చాయి. మార్పు కోసం బీజేపీ శంఖారావం పేరుతో మహబూబ్ నగర్లో తొలి సభ పెట్టుకున్న బీజేపీ నేతలు టీఆర్ఎస్ ని టార్గెట్ చేసే క్రమంలో సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. 2014లో అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాటతప్పిన కేసీఆర్, 2018లో అయినా ఆ మాట నిలబెట్టుకుంటారా లేక కొడుకు కేటీఆర్ కి పట్టాభిషేకం చేస్తారా అని ప్రశ్నించారు. 

Image result for amith shah

కేసీఆర్ స్పష్టంగా చెప్పాలని నిలదీశారు. దళితుడ్ని సీఎం చేస్తారా చేయరా అనే విషయాన్ని పక్కనపెడితే, ఈ ప్రశ్నతో రాబోయే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని బీజేపీ అంగీకరించినట్టు అయింది. ఇది మాత్రమే కాదు, ఇదే సభా వేదికపై రెండో సెల్ఫ్ గోల్ కూడా వేసుకుంది బీజేపీ. 

Image result for amith shah

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక వివిధ పథకాల ద్వారా 1.15 లక్షల కోట్లు మంజూరయ్యాయని, వీటితో తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు భేషుగ్గా జరుగుతున్నాయని చెప్పారు అమిత్ షా. అంటే ఆ నిధులన్నింటినీ కేసీఆర్ ప్రభుత్వం సక్రమంగానే ఖర్చుచేసిందని పరోక్షంగా చెబుతున్నారన్నమాట. తెలంగాణలో అభివృద్ధి జరిగిందని ఒప్పుకున్న బీజేపీ టీమ్ పరోక్షంగా ఈ దఫా కూడా టీఆర్ఎస్ కే పట్టం కట్టండి అన్నట్టుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: