మిర్యాలగూడ లో జరిగిన పరువు హత్య కేసులో ఎన్నో దారుణమైన నిజాలు బయటకు వస్తున్నాయి.  తన మాట కాదని తన కూతురు తమకన్నా తక్కువ కులం యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న అమృత తండ్రి మారుతి రావు కక్ష్యతో దారుణంగా ప్రణయ్ ని చంపించిన విషయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ సృష్టిస్తుంది.  అయితే ప్రణయ్ ని హత్య చేయించేందుకు నిర్ణయించుకున్న మారుతీరావు, గుజరాత్ మాజీ హోమ్ మంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో జైలు శిక్షను అనుభవించి విడుదలైన ఉగ్రవాది మహ్మద్ బారీతో కలసి డీల్ కుదుర్చుకున్నాడు. 

ఈ విషయంలో కొద్ది రోజులుగా సంప్రదింపులు జరిగాయి..ప్రణయ్ ని చంపించడానికి భారీ సన్నాహాలు సిద్దం చేసుకున్నారు.  ఈ నేపథ్యంలో నల్గొండకు చెందిన మహ్మద్ బారీకి కాంగ్రెస్ పార్టీ నేత ఎండీ కరీమ్ ఆశ్రయం ఇచ్చాడు.  గతంలో ఓ భూకబ్జా వివాదంలో మహ్మద్ బారీ మిర్యాలగూడకు వచ్చిన సందర్భంగా ఆ భూ తగాదాలో మారుతీరావు కలుగచేసుకొని ఇరువురి మద్య సయోద్య కుదర్చిరాట..అప్పడు ఏర్పడ్డ సంబంధాల నేపథ్యంలో బారీ సహాయాన్నితీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

హత్యకు ప్లాన్ చేసిన తరువాత బారీకి కరీమ్ ఆశ్రయం ఇచ్చాడని, డబ్బులు కూడా కరీమ్ ద్వారానే బారీకి అందాయని పోలీసులు వెల్లడించారు.  కాగా, బారికి సహాయంగా  రంగా రంజిత్, శ్రీకర్, షఫీ అనే యువకులనూ అరెస్ట్ చేసి విచారిస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: