రాష్ట్రంలో కీలకమైన సామాజిక వర్గంగా ఉన్న కాపుల కంటే బీసీలు బెస్ట్ అనుకుంటున్నారా..ఈ దఫా వారికే ఎక్కువ సీట్లు ఇస్తారా ... వ్యూహాత్మకమైన   నిర్ణయాల ఫలితమా, చూడబోతే ఓ లెక్కలోనే ఇదంతా సాగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై హాట్ హాట్ డిస్క్సషన్స్ సాగుతున్నాయి.


మనసు అటువైపేనా :


ఏపీలో ఇపుడు కాపుల రూటెటు అంటే ఒకే ఒక పార్టీని ఎక్కువ‌మంది చూపిస్తున్నారట. ఇదంతా పదేళ్ళ క్రితం ప్రజారాజ్యం నాటి పరిస్తితులను తలపిస్తున్నాయని అంటున్నారు. అప్పట్లో కూడా రెండు బలమైన పార్టీలు ఏపీలో ఉంటే కాపులు మూడవ ఆప్షన్ గా పీఆర్పీని ఎంచుకున్నారు. ఫలితంగా  అది కాపుల పార్టీగా తయారై మిగిలిన సామాజిక వర్గాలు గుర్రుమన్నాయి. అది ఓటమికి దారితీసిందని చెబుతారు.


అదే సీన్ :


ఇపుడు కూడా అలాంటి సీన్ రిపీట్ అవుతోందంటున్నారు. ఏపీలో పోయిన ఎన్నికల్లో కాపులు టీడీపీని బలపరచారు. ఈసారి మాత్రం వారు జనసేన వైపు నడుస్తారని టాక్ ఉంది.  ఈ సంగతి తెలిసి ప్రధాన పారీలు కొత్త స్ట్రాటజీలను అమలు చేస్తున్నాయి. టీడీపీ వరకూ తీసుకుంటే ఎక్కువ సీట్లు ఇచ్చి బుజ్జగించాలనుకుంటోంది. మరి వైసీపీ దానికి భిన్నమైన రూట్లో వెళ్తోందని అంటున్నారు.


బీసీల వైపు:


వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్న వైసీపీ కాపుల విషయంలో అలెర్ట్ గా ఉంటోందని అంటున్నారు. వారికీ ఎటూ జనసేన పార్టీ ఉందని, తాము ఎన్ని సీట్లు ఇచ్చినా కూడా పోల్చి చూస్తే తక్కువే అవుతుందని వైసీపీ వ్యూహకర్తలు భావిస్తున్నార్ట. అదే టైంలో వెనకబడిన బీసీలు, ఇతర కులాలకు సీట్లు ఎక్కువ ఇవ్వడం ద్వారా ఆయా వర్గాల మద్దతు బాగా తీసుకోవచ్చునని అధికారానికి అది దగ్గర దారి అవుతుందని కూడా నమ్ముతున్నారట.
ఇలా పకడ్బందీగా లెక్కలన్నీ చూసుకునే జగన్ కాపుల విషయంలో అంతగా ఆసక్తి చూపించడం లేదంటున్నారు. మొత్తానికి జగన్ వ్యూహం ఎంత మేరకు ఫలిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: