వైసీపీ అసెంబ్లీ ని బహిష్కిరించి నిరసన తెలియజేసిన సంగతీ తెలిసిందే. దీనితో టీడీపీ కి ప్రతి పక్షం లేక పోయేసరికి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే తనకి వ్యతిరేకంగా మాట్లాడే ఎవరూ అసెంబ్లీలో ఉండకూడదు అనేది చంద్రబాబు నైజం. అందుకే ప్రతిపక్షాలు అసెంబ్లీకి రాము అంటున్నా బైటకి సవాళ్లు విసిరారే తప్ప లోలోపల చాలా సంతోష పడ్డాడు. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకి తలదించుకోవాల్సి పరిస్థితి రాలేదని ఆనందించాడు. అయితే అసలు ప్రశ్నించేవారే సభలో ఉండకూడదని ఆయన అనుకుంటున్నారు. వైసీపీ లేని సభలో.. బీజేపీ నేతలు ప్రశ్నలు అడుగుతుంటే బాబుకు తలనొప్పి మొదలైనట్టుంది.

Image result for chandrababu naidu\

అందుకే వాస్తవాలు అంగీకరించలేని బీజేపీ సభ్యులు అసెంబ్లీలో కూర్చోడానికి  అనర్హులంటూ చిందులు తొక్కారు చంద్రబాబు. అసెంబ్లీలో కూర్చునే అర్హత గురించి మాట్లాడ్డానికి చంద్రబాబు ఎవరు? ప్రజలు వేసిన ఓట్లే దానికి అర్హత. ఇంకా చెప్పాలంటే మోదీ, పవన్ కల్యాణ్ పెట్టిన బిక్షతో అసెంబ్లీలో కూర్చోగలిగారు టీడీపీ నేతలు. అలాంటి ఎమ్మెల్యేల నాయకుడు చంద్రబాబు కూడా అర్హత గురించి మాట్లాడ్డానికి అర్హుడేనా..?

Image result for chandrababu naidu\

బహిరంగ సభల్లో ప్రసంగించడానికి బాగా అలవాటు పడ్డ చంద్రబాబు ఎవరు ఏం చెబుతున్నా వినిపించుకునే పరిస్థితిలో లేరు. ప్లకార్డ్ లు పట్టుకుని నిలుచున్నా కేసులు పెట్టించే బాబు.. అసెంబ్లీలో ప్రసంగానికి అడ్డుతగిలితే ఒప్పుకుంటారా? ఆయనకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా సహిస్తారా?. అందుకే వైసీపీని చాలా తెలివిగా అడ్డు తొలిగించిన బాబు, ఇప్పుడు బీజేపీ నేతలపై కస్సుబుస్సుమంటున్నారు. విభజన హామీలపై అధిష్టానాన్ని ప్రశ్నించండి అంటూ వారికే సుద్దులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: