ఎన్టీఆర్ తండ్రి చనిపోయిన తరువాత మొదటి సారి అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడ బోతున్నాడు. అయితే తాజాగా ఈనెల 20న పాట‌ల‌ను నేరుగా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. వాస్త‌వానికి ఆడియో ను గ్రాండ్ గా నిర్వ‌హించి…ప్రి రిలీజ్ వేడుక‌ను సింపుల్ గా చేయాల‌నుకున్నారు.ఈ నేప‌థ్యంలో ఆడియో కు అతిధులుగా మ‌హేష్ బాబు ను, బాల‌య్య బాబును ఆహ్వానించాల‌నుకున్నారు. కానీ చివ‌రి నిమిషంలో నిర్ణ‌యాలు మారిన‌ట్లు తెలుస్తోంది. ఆడియో ను డైరెక్ట్ గా రిలీజ్ చేసి..ప్రీ రిలీజ్ వేడుకును గ్రాండ్ గా చేయ‌నున్న‌న్న‌ట్లు యూనిట్ అధికారింగా తెలిపింది.

Image result for jr ntr

ఈ నేప‌థ్యంలో అనుకున్న అతిధులు ప్రీ రిలీజ్ వేడుక‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇప్పుడు తండ్రి పోయిన బాధ‌లో ఉన్న నేప‌థ్యంలోనే ఈ మార్పుల‌న్నీ చోటుచేసుకున్న‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి ఎన్టీఆర్ త‌మ సినిమా ప్ర‌చారాన్ని త‌న‌తో సంబంధం లేకుండా..మ‌న‌సులో ఎలాంటి బాధ పెట్టుకోకుండా చేసుకోండ‌ని చెప్పాడుట‌. కానీ నిర్మాత రాధాకృష్ణ‌, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ అందుకు ఒప్పుకోలేద‌ట‌.

Image result for jr ntr

ఏదో ఒక ఈవెంట్ గ్రాండ్ గా చేద్దాం….దానికి ఎన్టీఆర్ వ‌స్తే చాలు అనుకునే ప్లానింగ్ లో మార్పులు చేసిన‌ట్లు తెలుస్తోంది. బ‌హుశా ప్రీ రిలీజ్ వేడుక రోజున ఎన్టీఆర్ త‌న బాధ‌ను అభిమానుల‌తో పంచుకునే అవ‌కాశం ఉంది. అలాగే తండ్రి చ‌నిపోయిన‌ నాల్గ‌వ రోజు నుంచి షూటింగ్ కు కూడా హాజ‌ర‌య్యారు. ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్ పై నెగిటివ్ కామెంట్స్ కూడా వ‌చ్చాయి. కాబ‌ట్టి వీట‌న్నింటిపై ఎన్టీఆర్ ఆ రోజు స్పందించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. చూద్దాం ఎన్టీఆర్ మైక్ ప‌ట్టుకుంటాడా? మౌనంగా వెళ్లిపోతాడా? అన్న‌ది. 


మరింత సమాచారం తెలుసుకోండి: