ఆయన సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి. బాబు జమానాలోనూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శింగా అమరావతి రాజధాని శంకుస్థాపనలో పాలు పంచుకున్నారు. తరువాత కాలంలో ఏపీ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ అయ్యారు. అలా బ్రాహ్మణులకు దగ్గరైన ఆయన బాబుతో విభేధించి దూరమయ్యారు. ఏపీ అభివ్రుధ్ధి, ప్రభుత్వ కార్యక్రమాలపైన పూర్తి అవగాహన కలిగి ఉన్న క్రిష్ణారావు టీడీపీ అవినీతిపైనా ఓ రేంజిల మీడియా ద్వారా పోరాడుతున్నారు.


విశాఖ బరిలో:


మరి క్రిష్ణారావు ఈ మధ్యనే  బీజేపీలో చేరారు. ఆయన సేవలను పూర్తిగా ఉపయోగించుకోవాలని బీజేపీ డిసైడ్ అయినట్లుగా భోగట్టా. విశాఖ లోక్ సభ నుంచి పోటీకి పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే విశాఖ సిటీలో బ్రాహ్మణ సామాజిక వర్గం ఎక్కువ శాతం ఉంది. అంతే కాదు, ఇంటెలెక్చువల్స్ తో పాటు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇక్కడే ఉన్నాయి. దాంతో క్రిష్ణారావు సరైన అభ్యర్ధి అని పార్టీ భావిస్తోంది.


ఊపు ఖాయం :


ఏపీలో బీజేపీ పని ఖతం అనుకుంటున్న టైంలో క్రిష్ణారావు లాంటి మేధావులను ముగ్గులోకి దింపడం ద్వారా బీజేపీ తెలివైన పనే చేస్తోందనిపిస్తోంది. బీజేపీకి కూడా అర్బన్ ఓటర్లలో పట్టు ఉంది. ఎంత చెడ్డా ఇప్పటికీ దేశానికి బీజేపీ మంచి పాలన ఇవ్వగలదని నమ్మే వారు అర్బన్లో ఎక్కువ మందే ఉంటారు. దానికి తోడు కేంద్ర ఉద్యోగులు, ఉత్తరాది నుంచి విశాఖలో సెటిల్ అయిన వాళ్ళు బీజేపీకి వెన్ను దన్నుగా ఉంటారు. ఇక మాటల చాతుర్యంతో క్రిష్ణారావు ఓ ఊపు ఊపేస్తారు.

పైగా అభివ్రుధ్ధి ఉత్తరాంధ్రలో ఏమీ జరగలెదని చెప్పడం ద్వారా ఆయన తన వైపు ఫొకస్ ఉండేలా చూసుకోగలరు. ఇపుడున్న పరిస్తితుల్లో క్రిష్ణారావు ని దింపడం అంటే  బెస్ట్ చాయిస్ అనే చెప్పుకోవాలి. మరి అయన రాజకీయ అవతారంలో ఎంత వరకు కుదురుకుంటారో చూడాల్సిఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: