తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితుడు దొరికాడు. నాలుగు రోజుల క్రితం నల్గొండ జిల్లా మిర్యాలగూడ జ్యోతి ఆసుపత్రిలో ప్రణయ్‌ను హత్య   సుభాష్ శర్మను పోలీసులు బీహార్ లో అదుపులోకి తీసుకున్నారు. బీహార్ లో కరడుగట్టిన నేరస్తుడైన  సుభాష్ శర్మ.. మారుతీరావు దగ్గర సుపారీ తీసుకొని హత్య చేశాడు. పోలీసులు 4 టింలుగా ఏర్పడి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  ప్రణయ్ ను హతమార్చిన వెంటనే మిర్యాలగూడ నుంచి బిహార్ కు వెళ్లిపోయాడు. బీహార్ లోని సమస్తిపూర్ జిల్లాలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.  


సుభాష్ శర్మను బీహర్ కోర్టులో ప్రవేశపెట్టి కోర్టు అనుమతితో నల్గొండకు తీసుకొస్తున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు సుభాష్ శర్మను తీసుకొని పోలీసులు నల్లగొండకు చేరుకుంటారు. ఆ తర్వాత వెంటనే ఎస్పీ రంగనాధ్ ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు తెలియజేయనున్నారు.   గతంలో కూడా పలు హత్యలలో శర్మ ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా సుపారీలు తీసుకొని మర్డర్లు చేయడమే శర్మ పనిగా తెలుస్తోంది. ప్రణయ్ హత్య కేసులో ఏడుగురు నిందితులు ఉన్నారని ఓ ఛానల్‌తో ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు.   


హత్యకు రూ.1 కోటి డీల్ కుదిరిందని వెల్లడించారు. రూ.18 లక్షలు అప్పటికే చెల్లించారని తెలిపారు. కులాంతర వివాహం వల్లే మారుతిరావు ప్రణయ్ పైన కక్ష పెంచుకున్నారని ఎస్పీ తెలిపారు. మారుతీరావు పోలీసుల అదుపులో ఉండటంతో విచారణలో వివరాలన్నీ వెల్లడించడంతో హంతకుడిని పట్టుకోవడ సులువైంది.   

Image result for pranay

ట్రాన్సిట్ వారంట్ పై ప్రణయ్ ని విమానంలో బీహారీ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి అటు నుంచి నల్లగొండకు తీసుకొస్తున్నారు. ఇదిలా ఉంటే..ప్రణయ్ కుటుంబ సభ్యులు..అమృత సానుభూతి పరులు శర్మను అక్కడే ఎన్ కౌంటర్ చేయాలని  డిమాండ్ చేస్తున్నారు. లేట్ చేసి మరొకరు చావకముందే వాడిని చంపేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.  కాగా,  ఈ సాయంత్రం హైదరాబాదులో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: