జగన్ మీద ఏ వార్త వచ్చిన దానిని వక్రీకరించడానికే ఉన్నట్టు  ఉంది ఎల్లో మీడియా. అయితే  దేశంలో అత్యధిక వార్షిక ఆదాయాన్ని కలిగి ఉన్న ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేసింది సెంటర్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్. ఈ నివేదిక ప్రకారం దేశంలోని అందరి శాసనసభ్యుల సగటు ఆదాయం 24.59 లక్షల రూపాయలు. అంతేగాక.. వ్యక్తిగతంగా ఏ ఎమ్మెల్యే ఎంత ఆదాయాన్ని పొందుతున్నాడో కూడా ఏడీఆర్ పేర్కొంది. ఈ జాబితాలో నంబర్ పొజిషన్లో ఉన్నాడు కర్ణాటకకు చెందిన ఒక ఎమ్మెల్యే.

Image result for jagan

ఆ సంగతలా ఉంటే ఈ జాబితాలో ఏపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. వీరిలో కూడా టాప్ లో ఉన్నాడు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి. దాదాపు 13కోట్ల రూపాయల వార్షిక కుటుంబ ఆదాయంతో జగన్ ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచాడని ఏడీఆర్ పేర్కొంది. ఇక యథాతథంగా జగన్ మీద విరుచుకుపడే వాళ్లు.. పచ్చమీడియా వర్గాలు రెచ్చిపోయాయి.

Image result for jagan

ఏడీఆర్ జాబితాలో జగన్ పేరు.. ఐదో స్థానంలో.. అంటూ మొదలుపెట్టారు. ఇది కూడా తప్పై పోయినట్టుగా మొదలుపెట్టారు. ఇక్కడ జగన్ ను మాత్రమేకాదు.. వార్షికాదాయం విషయంలో వాస్తవాలు వెల్లడించిన వాళ్లందరినీ అభినందించాలి. వీళ్లు తమ సంపాదనను వైట్ మనీగా చూపిస్తున్నారు. తాము సంపాదించిన దానికి ట్యాక్సులు కట్టడం ద్వారానే వీళ్లు ఏడీఆర్ జాబితాలో స్థానం సంపాదించారు. దానికిన కూడా  పచ్చ మీడియా తన వక్ర బుద్ది ని చూపించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: