ఆంధ్రప్రదెశ్ ను నిట్టనిలువునా చీల్చిన కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధి నేడు మాట మార్చారు. రాష్ట్రాన్ని బీజేపీ నడి సముద్రంలో ముంచిందని కర్నూలులో జరిగిన 'సత్యమేవ జయతే సభ' లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బిజేపీపై నిప్పులు చెరిగారు. విభజన సమయంలో పార్లమెంట్‌ సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీల్ని బీజేపీ తుంగ లో తొక్కిందని, ఐదేళ్లు హోదా ఇస్తామని కాంగ్రెస్ చెబితే, పదేళ్ల ఇస్తేనీఅ సరిపోతుందని కూడ బిజెపి అని గుర్తు చేశారు. నరెంద్ర మోదీ ప్రధానిగా పదవి చేపట్టి నాలుగేళ్లు దాటినా, ప్రత్యేక హోదా దిశగా ఒక్క అడుగు కూడా పడలేదన్నారు రాహుల్.  
Image result for rahul gandhi images in kurnool
ప్రత్యేక హోదా విషయంలోనే కాదు, ఇతర విభజన హామీల విషయంలోనూ బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు రాహుల్. 

పోలవరంకు జాతీయ హోదా, 
కడప స్టీల్ ఫ్యాక్టరీ, 
విశాఖ రైల్వే జోన్‌ 
అంతర్జాతీయ విమానాశ్రయాలు, 
హైవేలు, 
మెట్రో రైల్, 
జాతీయ విద్యా సంస్థలు 

వంటి హామీలను అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చారని వాటిని నెరవేర్చడంలో నరేంద్ర మొడీ విఫలమయ్యారన్నారు. యూపీఏ ప్రభుత్వం చొరవతో ఆలోచించి, తెలుగురాష్ట్రాల మధ్య నీటి వివాదాలు రాకుండా కృష్ణా, గోదావరి బోర్డుల్ని ఏర్పాటు చేసిందని రాహుల్ గుర్తు చేశారు. 
Related image
2014 తర్వాత కూడా ఏపీకి బీజేపీ అనేక హామీలు ఇచ్చిందని గుర్తు చేస్తూ, విభజన చట్టమంటే ఎన్డీఏ ప్రభుత్వానికి గౌరవం లేదని, పార్టీ తరఫున ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు రాహుల్ గాంధి. ఏపీకి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాల్సిందేనని, తనకు మోదీలా తప్పుడు వాగ్థానాలు ఇచ్చే అలవాటు లేదన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు. ఏదైనా హామీ ఇస్తే, దాన్ని నెరవేర్చాకే ఆ గడ్డపై అడుగు పెడతానన్నారు. 2019 లో ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఫైల్‌పై తొలి సంతకం చేస్తానన్నారు. ఇదీ రాష్ట్రానికి ఇచ్చే బహుమతి కాదని, ప్రజల హక్కు అని రాహుల్ అన్నారు. 
Image result for AP CM Damodaram sanjeevaiah
కర్నూలు పర్యటనలో దేశం లోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఇంటికి వెళ్లానన్నారు రాహుల్ గాంధి. "జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో, సంజీవయ్యను సీఎంగా చేయాలన్న ప్రతిపాదన వచ్చిందని, అప్పుడు కొంత మంది ఆయనపై అవినీతిపరుడని జవహర్లాల్ నెహ్రూ దగ్గర ప్రస్తావించారన్నారు. ఆ అవినీతి ఆరోపణల నిగ్గు తేల్చేందుకు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేతను కర్నూలు జిల్లా పెదపాడు కు పంపారని, ఆ ఊరిలో ఒక ముసలావిడ కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ కనిపించగా, ఆ మహిళను సంజీవయ్య ఇల్లు ఎక్కడని అడిగితే ఇదే సంజీవయ్య ఇల్లు అని చూపించిందట. తానే సంజీవయ్య తల్లినని ఆ వంట చేస్తున్న పెద్దావిడ చెప్పింది. 
Image result for AP CM Damodaram sanjeevaiah
ఆ తర్వాత ఢిల్లీ వెళ్లిన ఆ నేత సంజీవయ్య అవినీతిపరుడంటే నమ్మడానికి ఏమీలేదని చెప్పడంతో, సంజీవయ్యను జవహర్లాల్నెహ్రూ గారు సీఎంగా నియమించరు" అని అప్పటి ఘటనను రాహుల్ గాంధి ప్రస్తావించారు. అలాగే మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కూడా గుర్తు చేశారు.

ప్రధాని మోదీ, ఎన్డీఏ ప్రభుత్వం పై మండిపడ్డారు రాహుల్. కాంగ్రెస్‌ హయాంలో ఒక్కో రఫెల్ యుద్ధ విమానాన్ని రూ.526 కోట్లకు కొనుగోలు చేస్తే, బీజేపీ హయాంలో ఒక్కో విమానాన్ని రూ. 600 కోట్లకు కొన్నారని విమర్శించారు. మోదీ యుద్ధ విమానాల కాంట్రాక్టును తన మిత్రుడు అనిల్‌ అంబానీకి ఇచ్చారని, బ్యాంకుల నుంచి రూ. 45 వేల కోట్లు దోచుకున్న గజదొంగ అనీల్‌ అంబానీ అని తీవ్ర విమర్శలు చేశారు. అలాగే విజయ్ మాల్యా ను దేశం దాటించండంలోనూ బీజేపీ పెద్దల పాత్ర ఉందని ఆరోపించారు. పార్లమెంట్‌లో రఫెల్‌పై మోదీని ప్రశ్నిస్తే తన కళ్లలో కళ్లు పెట్టి చూసే ధైర్యం చేయలేక పోయారని రాహుల్ ఎద్దేవా చేశారు. 

Image result for AP CM Damodaram sanjeevaiah

మరింత సమాచారం తెలుసుకోండి: