కన్నడ సీమలో కన్ను కొట్టుకున్నా ఆ రెండు పార్టీలు కర్నూల్ సాక్షిగా కలసిపోయేందుకు రెడీ అవుతున్నాయి. అందుకు రాహుల్ స్పీచ్ లో చంద్రబాబు పాలనపై కనీసం  ఏమీ అనకపోవడమే కాదు. అసలు ఇక్కడ ఊసే తలవక పోవడం చూసే డౌట్ లేదు రెండూ ఒక్కటవుతున్నాయి అని అర్ధమైపోతోంది. నిజానికి ఆయన వచ్చింది ఏపీకి, ఇక్కడ ప్రతిపక్ష టీడీపీ అధికారంలో ఉంది. మరి కొద్ది నెల‌ల్లో  ఏపీలో ఎన్నికలు జరబోతున్నాయి. ఏపీలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. మచ్చుకు ఒక్కటైన ప్రస్తావించాడా  రాహుల్ అంటే పచ్చ బంధం అలాంటిది మరి.


మోడీని తిట్టడానికేనా :



ఏపీకి వస్తే కనీసం తన ఉపన్యాసంలో కొంతలో కోంతైనా ఇక్కడ సమస్యలు ప్రస్తావించాల్సిన రాహుల్  అసలు ఏమీ కానట్లుగా మోడీని చెడా మడా తిట్టేసి పోయారు. ఏపీలో మోడీని తిడిదే ఏం లాభం ఉంటుందో రాహుల్ బాబే చెప్పాలి. కానీ ఇక్కడో కనబడని అంతస్సూత్రం ఉంది. అదేమంటే మోడీని ఎంతలా తిడితే అంతలా బాబు మెప్పు పొందవచ్చు. అంటే రాహుల్ వచ్చింది ఏపీ ప్రజల ఉధ్ధరణకు కాదన్న మాట. బాబు గారిని ప్రసన్నం చేసుకునెందుకు. మరి అలాంటి పెద్ద మనిషి ఏపీలో అవినీతి గురించి, ప్రజల కష్టాల గురించి మాట్లాడుతాడు అనుకోవడం వెర్రితనమే అవుతుంది.


పచ్చ మీడియా పులకింత :


రాహుల్ సుత్తి లేకుండా సూటిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారట. ఇక ఆ పార్టీకి ఏపీలో తిరుగులేదుట. కర్నూల్ సభ తరువాత డిబేట్ల మీద డిబేట్లు పెట్టిన టీడీపీ అనుకూల మీడియా రాహుల్ ని  అంతెత్తున పొగిడేసింది. చూస్తున్న వీక్షకులకు మతి పోయెలా కాంగ్రెస్ సంకీర్తనలు ఆలపించేసింది. అచ్చం 2014లో మోడీని పొగిడినట్లు అన్నమాట. ఇక ఓ చానెల్ డిబేట్ కి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాహుల్ ప్రసంగం గురించి సన్న సన్నగా పొగుడుతూ బీజేపీపై విరుచుకుపడడం చూస్తూంటే పొత్తులకు ఎంతగా తహ తహలాడుతున్నరో అర్ధమైపోతోంది. 


జత కలిసే :


మొత్తానికి జత కలిసే అని పాటలు పాడుకోవడమే  ఆ రెండు పార్టీలకూ మిగిలినట్లుంది. పచ్చ మీడియా పౌరోహిత్యంతో వ్యవహారం ఇంతవరకూ వచ్చేసింది. ఏపీకి హోదా కావాలంటున్న వేళ ఇస్తానని చెబుతున్న రాహుల్ తో కలసిపోతే తప్పేంటన్న లాజిక్ పాయింట్ ని ఒకటి  తీసి ఏపీ జనం బుర్రల్లోకి ఎక్కించే ప్రక్రియ ఈ రోజు నుంచి ఇంకా గట్టిగా మొదలైపోయింది. ఇక ముందు ముందు స్నేహగీతాలు ఆలపించడమే మిగిలింది.


అయితే ఈ పొత్తుల ఎత్తుల గురించి సోషల్ మీడియాలో మాత్రం సెటైర్లు తెగ పడిపోతున్నాయి. జాతీయ పార్టీలు అన్నవి లేనే లేవని, హోదాను విభజన బిల్లులో పెట్టకుండా నాడు మోసం చేసిన కాంగ్రెస్ ఇపుడు బిస్కట్లు ఇస్తానంటే  ఏపీ జనం నమ్మరని కూడా నెట్ జన్లు ఓ రేంజిలో ఏకుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: