కేంద్ర ఎన్నికల సంఘం కాంగ్రెస్ పార్టీ పై తీవ్రంగా మండిపడింది. ఎన్నికలు కాంగ్రెస్ చెప్పినట్టుగా నిర్వహించడం కుదరదు అని దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. తాజాగా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కమలనాథ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.

Image result for congress logo

న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్ పై ఘాటుగా స్పందించింది ఈ సి. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ అని... చట్టాలకు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ అని తెలిపింది. అంతే కాకుండా ఎన్నికల విషయాల్లో ఎలా నడుచుకోవాలో చెప్పే అధికారం ఎవరికీ లేదని ఈసీ తన అఫిడవిట్‌లో పేర్కొంది.

Image result for elections commission

ఎన్నికల సంఘం విధుల్లో పదేపదే జోక్యం చేసుకుంటూ.. ఇలా ఒకే అంశంపై మళ్లీ మళ్లీ కోర్టుకు ఎక్కడం సరికాదు అని ఈసీ చెప్పింది. కచ్చితంగా ఇలాగే ఎన్నికలు నిర్వహించాలని అడిగే లేదా ఆదేశించే హక్కు కమల్‌నాథ్‌కు, ఆయన పార్టీకి లేదని స్పష్టంచేసింది.

Related image

తన, తన పార్టీ అనుకున్నట్లుగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఓ అసంబద్ధమైన చర్య అని ఈసీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ పిటిషన్‌ను వెంటనే కొట్టేసి, పిటిషనర్‌కు జరిమానా విధించాలని కోర్టును కోరింది. ఎన్నికల నిర్వహణలో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు అని..దానికి తగినట్లు వ్యవహరిస్తామని తేల్చి చెప్పింది.



మరింత సమాచారం తెలుసుకోండి: