ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వచ్చినపుడే నేతాశ్రీలకు జనం గుర్తుకువస్తాయి. అలాగే ఇచ్చిన హామీలు ఒక్కొక్కటీ కనిపిస్తాయి. ఇక బలమైన ప్రతిపక్షం ఉంటే మరింతగా జాగ్రత్తపడతారు. ఆలా కనుక ఆలోచిస్తే ఏపీ పాలిటిక్స్ లో ఇపుడు తాయిలాల పర్వం మోదలైదని చెప్పవచ్చు. కూత వేటు దూరంలో ఎన్నికలు వచ్చేసిన టైంలో ఓటరు మహాశయుల మనసు చూరగొనేందుకు రెడీ అయిపోతున్నారు. 


ఆయన్ని చూసి అలెర్ట్ :


విశాఖ జిల్లాలో జగన్ పాదయాత్ర చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం ఆయన భీమిలీ నియోజకవర్గంలో ఉన్నారు. రెండు రోజుల క్రితం ఇక్కడ  సభ పెడితే జనం విరగబడి వచ్చారు. దాంతో ఇక్కద ఎమ్మెల్యే అయిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు విషయం అర్ధం అయిపోయింది. అంతే ఒక్కసారిగా  పోయిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలూ వరసగా గుర్తుకొచ్చాయి.  భీమిలీతో పాటు, మరో  రెండు నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లను తెచ్చే పెద్ద సమస్య పరిష్కారం కోసం ఆయన ఏకంగా బాబు ముందు సిట్టింగ్ వేశారు.


అది తీరితే ఓట్ల పంటే :


మంత్రి గంటా పెద్ద స్కెచ్ వేసారు. తన భీమిలీ పరిధిలో ఉన్న సిమ్హాచలం పంచగ్రామల భూముల సమస్యను తలకెత్తుకున్నారు. దాదాపు ఇరవై వేల కుటుంబాల సమస్య అది. దేవస్థానం భూములల్లో ఇల్లు కట్టుకున్న వారి భూములను రెగురలైజ్ చేయడం అక్కడ డిమాండ్. చెప్పడానికి సులువుగా ఉన్నా పరిష్కారం బహు కష్టమే. కానీ రాజు తలచుకుంటే చేయగలగడమూ సులువే మరి.


తేల్చేస్తారా :


విశాఖ జిల్లాలో రగులుతున్న పంచ గ్రామాల ఇష్యూ మీద  ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుఈ రోజు సిట్టింగ్ జరగనుంది. ప్రభుత్వం దీని విషయంలో లబ్దిదారులకు న్యాయం చేయాలనుకుంటోంది. అయితే దేవస్థానం భూముల అన్యాక్రాంతం పై హిందూ ధార్మిక సంస్థలతో పాటు, ఏకంగా టెంపుల్ పెద్దలు వేసిన కేసులు కోర్టు లో ఉన్నాయి. వాటిని విత్ డ్రా చేయించడం ద్వారా ఉభయ కుశలోపరి మార్గంగా డీల్ చేయాలని బాబు సర్కార్ భావిస్తున్నట్లు భోగట్టా. 


అదే కనుక జరిగితే విశాఖ జిల్లాలో భీమిలి, పెందుర్తి, విశాఖ పశ్చిమ నియోజకవర్గాల ప్రజానీకం ఓట్లను టీడీపీ గుత్తమొత్తంగా సాధించే వీలుంటుంది. జగన్ పాదయాత్రతో దడ పుట్టిన అధికార పార్టీ ఏళ్ళ నాటి సమస్యను సెటిల్ చేయాలనుకుంటోంది. అయితే అతి పెద్ద వివాదంగా ఉన్న దీన్ని  సరిగ్గా డీల్ చేయలేకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదమూ ఉంది చూడాలి. ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: