రక్షక భటులు అంటే..ధన, మాన ప్రాణాలు కాపాడేవారని ఎంతో గౌరవం ఇస్తాం.  సొసైటీలో వారంటే భయ భక్తులు కూడా ఉంటాయి.  కానీ ఈ మద్య కొంత మంది రక్షక భటులు కామాంధులుగా మారి ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు.  ముఖ్యంగా మహిళల పట్ట అసభ్యంగా ప్రవర్తించడం..లైంగక దాడులు నిర్వహించడం లాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా  మహిళను లైంగికంగా వేధించిన కేసులో.. వాయల్పాడు సీఐ సిద్ద తేజమూర్తిని సస్పెండ్ చేసిన డీఐజి. 

న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్తే..మహిళను లొంగదీసుకోవడానికి ప్రయత్నించిన సీఐ.  నీ కేసు కోర్టుకు వెళితే త్వరగా పరిష్కారం కాదని..నేను పర్సనల్ కేర్ తీసుకొని పై అధికారులో మాట్లాడి సమస్య త్వరగా పరిష్కరిస్తానని ఆశచూపించాడం మొదలు పెట్టాడని ఆరోపిస్తుంది బాధిత మహిళ.  తన ఫోన్ నెంబర్ తీసుకొని కాల్స్ చేయడం అసభ్యంగా మాట్లాడటం..ఆఫర్ ఇవ్వడం ఇలా లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించింది.

తిరుమలలో డ్యూటీ పడటంతో..కొండమీదే రాసలీలలకు ప్లాన్ చేసిన సిద్ద తేజ మూర్తి. రూమ్ బుక్ చేశాను...రమ్మంటు మహిళ ను వేధించడం మొదలు పెట్టాడు.  అయితే తన బండి తీసుకొని ఇంటికి వచ్చి..ఎందుకు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. నీకు కేసు పాజిటీవ్ గా కావాలా..నీకు ఫేవర్ గా ఉండాలంటే నేను డీఎస్పీతో మాట్లాడుతాను..సతాయించడం మొదలు పెట్టాడు.

అతడి వ్యవహారం పై అనుమానం వచ్చి సెల్ ఫోన్ లో సీఐ బూతు పురాణాన్ని రికార్డు చేసిస మహిళ.  మహిళా సంఘాలతో కలిసి ఎఎస్సైని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే ప్రయత్నం చేసిన బాధితురాలు.  చివరి నిమిషంలో పసిగట్టి జారుకున్న సీఎం తేజమూర్తి. సీఎం బాగోతాన్ని మీడియా ముందు బయట పెట్టిన బాధితురాలు.  సిద్ద తేజ మూర్తి బండారం బయట పడటంతో సస్పెండ్ చేసిన డీఐజీ. 


మరింత సమాచారం తెలుసుకోండి: