ఎన్నిక‌ల మేనేజ్‌మెంట్‌ తెలిసి ఉండాలే కానీ.. గెలుపు ఓ లెక్కా! అన్న‌ట్టుగా తెలంగాణ రాజ‌కీయ ప‌రిస్థితి మారిపోయింది. అధికార పార్టీ టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ముంద‌స్తు ముచ్చ‌ట‌కు తెర‌దీశారు. అంతేకాదు, ఏ పార్టీతోనూ పొత్తు లేకుండానే ఆయ‌న ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌నున్నారు. న‌వంబ‌రు తొలి వారంలోనే ఎన్నిక‌లు అదే నెల చివ‌రి వారంలోనే రిజ‌ల్ట్‌, ఇక‌, డిసెంబ‌రు రెండో వారం నాటికి కొత్త స‌ర్కారు ఏర్పాటు ఖాయం.. అయిన నేప‌థ్యంలో ఎన్నిక‌ల్లో ఏ పార్టీ ఆ పార్టీ త‌న వ్యూహ ప్ర‌తివ్యూహాల‌ను సిద్ధం చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎట్టి ప‌రిస్థితిలోనూ పుంజుకుని అధికారం ద‌క్కించుకు నేందుకు కాంగ్రెస్ పార్టీ చిన్నా చిత‌కా పార్టీల‌ను కూడా క‌లుపుకొని త‌న బ‌లాన్ని మ‌రిచిపోయి.. మ‌హాకూట‌మికి సిద్ధ‌మైంది. 

Image result for telangana

ఇక‌, అధికార టీఆర్ ఎస్ విష‌యానికి వ‌స్తే.. ఒంట‌రిపోరుకే కేసీఆర్ మొగ్గు చూపారు. అయితే, ఉద్య‌మం హోరాహోరీగా సాగిన 2014లో తెలంగాణ ఏర్పాటైన త‌ర్వాతే ఆయ‌న పార్టీకి కేవ‌లం 67 సీట్లు మాత్ర‌మే ద‌క్కాయి. ఇక‌, ఇప్పుడు నాలుగేళ్ల మూడు మాసాల పాల‌న త‌ర్వాత ప్ర‌జ‌ల్లో పెల్లుబుకుతున్న వ్య‌తిరేక‌త ఆయ‌న‌పై తీవ్రంగా ఉంటుంద‌నేది విశ్లేష‌కుల మా ట‌. అంతేకాకుండా కుటుంబ రాజ‌కీయాల‌కు కూడా కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు కేవ‌లం జాత‌కాలు, ముహూ ర్తా లు చూసుకునే ప్రభుత్వాన్ని ర‌ద్దు చేశార‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో ఎంతో కొంత ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త కేసీఆర్‌కు త‌గ‌ల‌క‌మాన‌ద‌ని అంటున్నారు. 


ఇక అదేస‌మ‌యంలో 105 మంది సిట్టింగు ఎమ్మెల్యేల‌కు ఛాన్స్ అన్నారు. ప్ర‌చారం కూడా ప్రారంభించారు. అయితే, నిజా నికి సిట్టింగు ఎమ్మెల్యేల్లో 40 మందికి ప్ర‌జ‌ల్లో తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఉంద‌ని అంటున్నారు. అయినా కేసీఆర్ టికెట్లు ఇచ్చా రు. స‌రే ఇవ‌న్నీ ఇలా ఉంటే. కేసీఆర్ బ‌లాల విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న మాటే ఆయ‌న ప్ర‌ధాన బ‌లంగా క‌నిపిస్తోంది. త‌న మాట‌కు తిరుగులేద‌ని, తెలంగాణ ప్ర‌జ‌లు త‌న‌వెంటే ఉన్నార‌ని ఆయ‌న ప్ర‌గాఢంగా విశ్వసిస్తున్నారు. ఇక‌, ఆయ‌న ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలు కూడా ఆయ‌న‌కు మేలు చేస్తాయ‌నేది కేసీఆర్ భావ‌న‌.  మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే తెలంగాణ లోని ప్ర‌ధాన మీడియా మొత్తం ఆయ‌న చేతిలోనే ఉండ‌డం. దీంతో కేసీఆర్ గెలుపు ఖాయ‌మేన‌న్న అంచ‌నాలు నిన్న‌టి వ‌ర‌కు ఉన్నాయి.

Image result for tdp congress

అయితే ఇప్పుడు ప‌రిస్థితిలో మాత్రం కాస్త మార్పు క‌నిపిస్తోంది. వార్ నిన్న‌టి వ‌ర‌కు వ‌న్‌సైడ్ అనుకున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, మ‌హాజ‌న‌స‌మితి కూట‌మి క‌డుతుండ‌డంతో కేసీఆర్ గెలుపు మ‌రి అంత సులువు కాద‌న్న చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. ఏదేమైనా కేసీఆర్‌కు వార్ వ‌న్‌సైడే అన్న టాక్ నుంచి గెలుపు క‌నాక‌ష్టం అన్నంత వ‌ర‌కు వ‌చ్చింది. మ‌రి ఎన్నిక‌ల వేళ ప‌రిస్థితులు ఇంకెలా ఎలా మార‌తాయో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: