కొండ‌ను త‌వ్వి ఎలుక‌ను ప‌ట్టారు అనే సామెత తెలుగులో చాలా పాపుల‌ర్. ప్ర‌భుత్వ వ్య‌వ‌హారం కూడా అంత‌క‌న్నా భిన్నంగా ఏమీ లేదు.  నాలుగేళ్ళ క్రితం రాజ‌మండ్రిలో జ‌రిగిన పుష్క‌ర ప్ర‌మాదానికి కార‌ణం మీడియా చేసిన‌ మితిమీరిన  ప్ర‌చారం పాటు  జ‌నాల మూఢ న‌మ్మ‌క‌మేన‌ట‌. ఈ విష‌యం తేల్చిందెవ‌ర‌య్యా అంటే ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వం నియ‌మించిన ఏక‌స‌భ్య‌ క‌మీష‌న్ జ‌స్టిస్ సోమ‌యాజులు క‌మిటి.  


చంద్ర‌బాబే మూల కార‌ణం


అప్ప‌ట్లో జ‌రిగిన ప్ర‌మాదానికి కార‌ణం చంద్ర‌బాబునాయుడు అత్యుత్సాహం, ప్ర‌చార‌యావ అని ప్ర‌పంచ‌మంతా చెబుతుంటే క‌మిష‌న్ మాత్రం ప్ర‌భుత్వం త‌ప్పేమీ లేద‌ని తేల్చేయ‌టం. అస‌లు ప్ర‌మాదం ఎందుకు జ‌రిగిందంటే అందుకు కూడా చంద్ర‌బాబే కార‌ణ‌మ‌ని అంద‌రూ చెబుతారు. కానీ ఆ దిశ‌గా క‌మీష‌న్ అస‌లు విచార‌ణ చేసిన‌ట్లు కూడా లేదు.  నివేదిక‌ను చూస్తుంటే ముందే అనుకుని క‌మీష‌న్  విచార‌ణ మొద‌లుపెట్టిన‌ట్లుగా అనుమానం వ‌స్తోంది. 


పుష్క‌ర ఘాట్లో స్నానం చేయ‌ట‌మే కార‌ణం


 2015, జూలై 15వ తేదీన గోదావ‌రి పుష్కార‌ల ప్రారంభానికి చంద్ర‌బాబునాయుడు కుటుంబ‌స‌మేతంగ రాజ‌మండ్రిలోని పుష్క‌ర‌ఘాట్ లో స్నానం చేశారు. ప్ర‌ముఖుల కోసం సిద్దం చేసిన విఐపి ఘాట్లో కాకుండా చంద్ర‌బాబు పుష్క‌ర ఘాట్లో ఎందుకు స్నానం చేశారంటే ఎవరూ స‌మాధానం చెప్ప‌టం లేదు.  ఓ చాన‌ల్ కోసం  గోదావ‌రి పుష్క‌రాల‌పై ఫిల్మ్ తీయించాల‌ని  ప్ర‌భుత్వం అనుకున్న‌ది. చంద్ర‌బాబు కుటుంబంతో పాటు స్నానం చేస్తున్న దృశ్యాల‌ను ఫిల్మ్ తీసే ఉద్దేశ్యంతో చాన‌ల్ వాళ్ళు పుష్క‌ర ఘాట్లో షూటింగ్ పెట్టుకున్నారు.  ఎందుకంటే, విఐపి ఘాట్లో జ‌నాలుండ‌రు. అదే ప‌ష్క‌ర ఘాట్లో అయితే అప్ప‌టికే వేలాదిమంది భ‌క్తులు స్నానం కోసం ఎదురు చూస్తున్నారు. దాంతో షూటింగ్ ను పుష్క‌ర ఘాట్ కు మార్చారు. ఎవ‌రు మార్చారంటే సమాధానం లేదు.

పోలీసులు, అధికారులు ఎవ్వ‌రూ లేరు


చంద్ర‌బాబు కుటుంబంతో పాటు స్నానం చేయ‌గానే అక్క‌డి నుండి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే సిఎం వెళ్ళిపోయారో అప్ప‌టి వ‌రకూ ఉన్న పోలీసులు, ఉన్న‌తాధికారులు కూడా  వెళ్ళిపోయారు. వెళ్ళేట‌పుడు పుష్క‌ర ఘాట్ల గేట్లు ఎత్తేసి వెళ్ళిపోయారు. దాంతో వేలాదిమంది భ‌క్తులు ఒక్క‌సారిగా ఘాట్ల‌లోకి వెళ్ళేందుకు ప్ర‌య‌త్నించారు. దాంతో తొక్కిస‌లాట జ‌రిగింది. ఆ ప్ర‌మాదంలో 29 మంది అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. ప్ర‌మాదం జరిగిన మూడు నెల‌ల‌కు ప్ర‌భుత్వం  సోమ‌యాజుల‌తో క‌మీష‌న్ వేసింది. ఆ క‌మీష‌నే  మూడేళ్ళ త‌ర్వాత నివేదిక‌ను ప్ర‌భుత్వానికి అందించింది. ఇపుడా క‌మిటీ నివేదికే సంచ‌ల‌నంగా మారింది.


ప్ర‌చారంతో ఊద‌ర‌గొట్టిందే ప్ర‌భుత్వం

Image result for godawari pushkaralu mishap somayajula committee

పుష్క‌రాల్లో స్నానం చేయాల‌న్న‌ జ‌నాల భ‌క్తిని  మూఢ‌న‌మ్మ‌కంగా క‌మీష‌న్ తేల్చేసింది. ప్ర‌మాధ స్ధ‌లంలోనే ఉన్న సిసి కెమారాల ఫుటేజీలు, ద్రోణ్ కెమెరాల్లోని ఫిల్మ్ ఏమైంద‌ని క‌మీష‌న్ విచారించ‌లేదు. బాధితుల‌ను చూడా ఏదో తూతూమంత్రంగా విచారించింది. పుష్క‌రాల‌కు ఏర్పాట్లు చేసిందే ప్ర‌భుత్వం.  143 ఏళ్ళ‌కు వ‌స్తున్న పుష్కరాల్లో స్నానం చేయ‌మ‌ని ఊద‌రగొట్టిందే ప్ర‌భుత్వం. ల‌క్ష‌లాది మంది భ‌క్తులొచ్చే ఆధ్మాత్మిక కార్య‌క్ర‌మంలో సరైన బందోబ‌స్తు పెట్ట‌క‌పోవ‌ట‌మే ప్ర‌భుత్వ వైఫ‌ల్యం. ఇవేవీ ప‌ట్ట‌ని క‌మీష‌న్ పుష్క‌ర ప్ర‌మాదానికి ప్ర‌ధాన కార‌ణం మీడియా అతి ప్ర‌చారం, జ‌నాల్లోని మూఢ నమ్మ‌క‌మే అని సింపుల్ గా తేల్చేయ‌టం విచిత్రంగ ఉంది. ప్ర‌మాదానికి కేంద్రబిందువే చంద్ర‌బాబు అయిన‌పుడు నివేదిక ఇంత‌క‌న్నా గొప్ప‌గా ఉంటుంద‌ని ఆశించ‌టం అత్యాసే. 


మరింత సమాచారం తెలుసుకోండి: