ఆ ఇద్దరూ మొన్నటి వరకూ మంచి దోస్తులు. రాజకీయమే వారి మధ్యన చిచ్చు పెట్టింది. ఒకటే సీటు కోసం ఇరువురు పోటీ దోసం అని క్యాడర్ చెబుతున్నా వినకుండా హాట్ ఫావరేట్ అంటూ దూసుకువచ్చారు. కొన్ని నెలల క్రితం రఛ్చ జరిగినా మొత్తానికి వ్యవహారం సద్దుమణిగింది అనుకుంటే మళ్ళీ ఆయన కెలికారు. అంటే హై కమాండ్ హామీ ఉండబట్టే కదా అంటున్నారు.


ఎమ్మెల్యేగానేనట :


ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానంటూ బల్ల గుద్ది మరీ చెబుతున్నారు అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి  శ్రీనివాసరావు. పార్లమెంట్ వద్దు అసెంబ్లీయే ముద్దు అంటున్నారు. 2019లో ఇదే నా రాజకీయం అని కూడా క్లారిటీ ఇచ్చేశారు. మరి ఆయన డ్రీం  సీట్ భీమిలి మాత్రమే.  అక్కడ చూస్తే ఖాళీ అయితే లేదు. మంత్రి హోదాలో గంటా శ్రీనివాసరావు ఉన్నారు. మరెలా సాధ్యం.


షిఫ్టింగేనా :


ప్రస్తుతం జగన్ పాదయాత్ర భీమిలీలో జోరుగా సాగుతోంది. జనం జగన్ కి జేజేలు పలుకుతున్నారు. అక్కడ మంత్రి గంటా పట్ల వ్యతిరేకత బాగా ఉందని టాక్. మరో వైపు 2009 ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేసిన ముత్తంశెట్టికి ఇప్పటికీ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన కనుక టీడీపీ క్యాండిడేట్ అయితే గెలుపు ష్యూర్ అని తమ్ముళ్ళు అంటున్నారు. గంటా భీమిలీ వైపు పెద్దగా రాకపోవడం, ఆయన అనుచరులు చేసిన పనుల వల్ల మొత్తం డ్యామేజ్ కావడంతో ఈ సీటు సైకిల్ పార్టీ చేజారుతుందా అన్న డౌట్స్ వచ్చాయి. 



అయితే దీనికి విరుగుడుగా ముత్తంశెట్టిని అక్కడ దింపి గంటాను అనకాపల్లి ఎంపీగా పంపుతారని టీడీపీలో టాక్ నడుస్తోంది. మరి మంత్రి గారు ఈ షిఫ్టింగ్ కి ఒప్పుకుంటారా అన్నది చూడాలి. అయితే మునుపట్లా పార్టీ చేంజ్ అయ్యేందుకు వేరే ఆప్షన్ కూడా లేనందున గంటా ఎంపీగానైనా వెళ్తార‌ని ఆ పార్టీ నేతలే అంటున్నారు. చూడాలి ఈ షిఫ్టింగ్ కధ ఏ మలుపు తీసుకుంటుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: