గోదావరి పుష్కరాలపై నివేదిక వచ్చింది. రిటైర్డ్ న్యాయమూర్తి సోమయాజులు కమిషన్ ప్రభుత్వాన్ని తప్పు పట్టకుండా మీడియాని తప్పుపట్టి చేతులు దులుపుకోవడం విశేషమే కాని, పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఏ కమిషన్ నివేదిక కూడా ఇంతకన్నా భిన్నంగా వస్తుందని ఎవరూ ఊహించలేదు. మూడ నమ్మకాలపై పెద్ద ఎత్తున మీడియా ప్రచారం చేసిందని, తొలి రోజుస్నానం చేయడం పుణ్యమన్నట్లుగా ప్రచారం జరిగిందని, మీడియా ప్రచారం చేసిందని, పత్రికలు, చానళ్లు గుడ్డినమ్మకాన్ని ప్రచారం చేశాయని నివేదికలో తెలిపారు.
Image result for somayajulu commission

వెనక తొక్కిసలాట మరణాల తో మృదంగం - ముందు విలాసాలకు ప్రచారాలకు షార్ట్ ఫిల్మ్ షూటింగ్  దీనికి విచారణ అవసరమా! ఇదీ ఒక ఓటుకు నోటు లాంటి సినిమానే 


ఆ ప్రచారానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్న సంగతిని సోమయాజులు కమిషన్ నివేదిక విస్మరించిందన్న విమర్శ వెల్లువలా వస్తోంది.పైగా ఇదంతా చంద్రబాబుపై పెట్టడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించాయని నివేదిక వ్యాఖ్యానించడం చిత్రంగానే ఉంటుంది. దాదాపు ఓటుకు నోటుకు కేసు లాగా జనం టివీల ముందు వీక్షించిన విలయం మొత్తం విచారణ కమీషన్ విస్మరించి న్యాయాన్ని చంపేసింది అని విపక్షాలన్నీ కోడైకూస్తున్నాయి. పాపం! సోమయాజులు గారి కళ్ళకు చంద్రమాయ కమ్మేసి ఉండవచ్చని పదుగురు అంటున్నారు.  
Image result for somayajulu commission
చంద్రబాబు సెంట్రిక్ గా షార్ట్ ఫిల్మ్  షూటింగ్ — ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుష్కరఘాట్ లో స్నానం చేయడం వంటి కారణాలను కమిషన్ నివేదిక పట్టించుకోక పోవడం గమనార్హం.  గోదావరి పుష్కరాలలో జరిగిన ధారుణమైన   తొక్కిసలాటపై ఏర్పాటు చేసిన  "రిటైర్డ్ జడ్జి సోమయాజులు కమిషన్ నివేదిక"  పై ప్రతిపక్షం వైసిపి తీవ్రంగా స్పందించింది. అది సోమయాజులు రాసినట్లు లేదని, చంద్రబాబు రాసినట్లుగా ఉందని ముఖ్యమంత్రి రాస్తే సోమయాజులు సంతకం చేసినట్లుగా ఉందని ఆ పార్టీ అదికార ప్రతినిది వాసిరెడ్డి పద్మ విమర్శించారు. నారా చంద్రబాబు నాయుడును కాపాడటానికే జస్టిస్‌ సోమాయాజులు నివేదిక ఇచ్చారని ఆమె అన్నారు. 
Image result for godavari pushkaralu chandrababu centric short film stampede
ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఎంతటివారినైనా నిభాయించగలరని, ఏదో విధంగా నియంత్రించగలరని చెప్పడానికి 'సోమయాజుల కమిటీ నివేదికా నిదర్శనమని అన్నారు. తప్పంతా భక్తులదే, మూడ నమ్మకాలతో అంతమంది అక్కడికి వెళ్లటం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పించడం సిగ్గుచేటని ఆగ్రహం వక్తం చేశారు. పుష్కరాల మరణాలకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. లేని ముహూర్తం పెట్టి, ప్రచార పటాతోపం తో ఒక యావతో 30మంది భక్తులను నిలువునా పొట్టన బెట్టుకున్నారని మండిపడ్డారు.
Image result for vasireddy padma comments on somayajulu commission report
సోమయాజుల కమిషన్‌ నివేదికలో ఉపయోగించిన భాష చాలా అభ్యంతరకరంగా ఉందని, ప్రజలకు ఇంగితం లేదని సోమయాజులు ఎలా అంటారని ప్రశ్నించారు. అలాంటి రాతలు రాయటానికి ఆ కమీషన్ కు చేతులెలా వచ్చాయని మండి పడ్డారు. చంద్రబాబును రక్షించటమే పనిగా అసలైన తొక్కిసలాట ఫుటేజ్‌ తొక్కేశారని, సోమయాజులు ఈ విశ్రాంత న్యాయమూర్తికి, గోదావరి మాత గుణపాఠం చెప్పకుండా ఊర్కోదని, గోదావరి క్షమించదని ఆమె ఒకరకంగా హెచ్చరిక, మరోరకంగా శాపం పెట్టేశారు. 

Image result for godavari pushkaralu chandrababu centric short film stampede

ఒక కుటుంబ విలాసం భక్త జన విలాపం 

మరింత సమాచారం తెలుసుకోండి: