తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ రద్దు అయినప్పటి నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఎవరి వ్యూహాలు వారు పన్నుతున్నారు.  ఇప్పటికే కేసీఆర్ ఎమ్మెల్యేలకు సంబంధించిన తొలి జాబితా రిలీజ్ కూడా చేశారు.   ఇదిలా ఉంటే..తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న వేళ... పార్టీ అధినేత రాహుల్ గాంధీ పలు మార్పులు చేశారు.  తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి కీలక పదవి దక్కింది. రేవంత్‌తో పాటు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు.

Image result for telangana

తెలంగాణ పీసీసీకి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు తొమ్మిది కమిటీలు ఏర్పాటు చేశారు.  టీపీసీసీకి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు 9 అనుబంధ కమిటీలను ఏర్పాటు చేశారు. 15 మందితో కోర్ కమిటీని ఏర్పరిచారు. టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి పదోన్నతి లభించింది.  


క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌గా భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, కో చైర్మన్‌గా డీకే అరుణ, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా దామోదర రాజనర్సింహ, కో చైర్మన్‌గా కోమటిరెడ్డి, స్ట్రాటజీ కమిటీ చైర్మన్‌గా వీ హనుమంత రావు, ఈసీ సమన్వయ కమిటీ చైర్మన్‌గా మర్రి శశిధర్ రెడ్డి, పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా కోదండరెడ్డిలను నియమించారు.  మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా దామోదర రాజనర్సింహను నియమించారు.


ఇక స్ట్రాటజీ కమిటీ ఛైర్మన్ గా వి.హనుమంతరావు నియమితులయ్యారు. ఈసీ సమన్వయ కమిటీ ఛైర్మన్ గా మర్రి శశిధర్ రెడ్డిని, పార్టీ క్రమశిక్షణ చర్యల కమిటీ ఛైర్మన్ గా కోదండరెడ్డిని నియమించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: