తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. దేశంలో ముందుగా నాలుగు రాష్ట్రాలలో జరగాల్సిన ఎన్నికల కంటే ముందే తెలంగాణ రాష్ట్రం ఎన్నికలకు రెడీ అయిపోయిన నేపథ్యంలో తెలంగాణ రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైపోయింది.

Related image

ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఒక వైపు ఉంటే బీజేపీ మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలు మహా కూటమిగా ఏర్పడి రాబోయే ముందస్తు ఎన్నికల లో కెసిఆర్ ని గద్దె దించడమే లక్ష్యంగా పని చేయడానికి రెడీ అయిపోయాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీ కవిత తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన మహాకూటమి పై సంచలన కామెంట్లు చేశారు.

Related image

తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన నాలుగు పార్టీలు అయినా టీడీపీ,కాంగ్రెస్ సిపిఐ ఇతర పార్టీలు కలిసి కూటమిలా ఏర్పడుతున్నాయి అని తెలుస్తుంది అని,ఆ పార్టీలు అన్ని ఒకప్పుడు అస్సలు తెలంగాణా రావాలని కోరుకొని పార్టీలని అస్సలు తెలంగాణా రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేనటువంటి పార్టీలని,ఈ పార్టీలు అన్ని కలిస్తే అది కూటమిలా కనిపించట్లేదు అని,మహాభారతం లోని “దుష్ట చతుష్టయం”లా కనిపిస్తుంది అని,అందులో దుర్యోధనుడు,దుశ్శాసనుడు ,కర్ణుడు మరియు శకుని ఉంటారని వారిలో వీరు ఎవరో రాబోయే రోజుల్లో ప్రజలే తేల్చి చెప్తారు అని,

Image result for kavitha trs

ప్రస్తుతం మహాకూటమిగా ఏర్పడి వీరందరూ ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకూడదు అని కోరుకున్న వారని పేర్కొన్నారు.  ఎవరు ఎన్ని మహాకూటమి లు పెట్టిన...వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఏ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: