తెలంగాణలో ఎన్నికల వాతావరణం హాట్ హాట్ గా ఉంది. ఒకపక్క పొత్తులతో సీట్ల విషయంలో మహా కూటమి వ్యక్తులు వేస్తుంటే...మరోపక్క అధికార పార్టీ టిఆర్ఎస్ ప్రత్యర్థులను విమర్శలతో ఇరుకున పెట్టే విధంగా వ్యవహరిస్తోంది.

Image result for harish rao

ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు..ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించడంపై అలాగే ఆయన ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీల పై మండిపడ్డారు. మరి అదేవిధంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పై కూడా మండిపడ్డారు హరీష్ రావు.

Related image

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు మొత్తం కెసిఆర్ వైపే ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని పార్టీలు మహాకూటమిగా ఏర్పడి టిఆర్ఎస్ పార్టీ ని ఓడించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని ప్రకటించి అనేకమంది తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసుకున్నారని మండిపడ్డారు.

Related image

మా కోట మీద ఏర్పడుతున్న పార్టీల నాయకులు మొత్తం కేవలం ఓట్ల కోసం మాత్రమే..అని ప్రజాసంక్షేమం కోసం కాదు అని పేర్కొన్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. రాహుల్ గాంధీ,వారు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తాం అంటున్నారు.వారు అలా ఇచ్చినట్టయితే తెలంగాణాకి అన్యాయం చేసినట్టు కాదా? అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లు వెయ్యాలని ప్రశ్నించారు. ఇంకా అనేక విషయాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ ని చంద్రబాబు ని అలాగే మిగతా రాజకీయ నాయకులను ఏకి పారేసారు హరీష్ రావు.




మరింత సమాచారం తెలుసుకోండి: