తెలంగాణాలో ఎన్నికల వేడి రాజుకున్నా ఆ పార్టీలో మాత్రం పెద్దగా తేడా కనిపించడంలేదు. ఎప్పటి మాదిరిగానే కుమ్ములాటలు, ముఠాలు, వర్గాల పోరుతో యమ బిజీగా ఉంది. కలసి ఒక్కటిగా రాజకీయ శత్రువుపై దండెత్తాల్సిన  టైంలో కూడా సొంత పార్టీలోని శత్రువులను నిర్మూలించాలన్న వెర్రి ఆవేశం అసలుకే చేటు తెస్తోంది. ఇది ఎన్నో మార్లు జరిగినా మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతోంది. దటీజ్   కాంగ్రెస్.


జంబోజెట్ టీమ్  :


పెళ్ళికి పోతూ చంకలో పిల్లిని పెట్టుకుని వెళ్ళిన చందాన ఎన్నికలకు పోతూ కాంగ్రెస్ తమతో పాటు గ్రూపు తగవులనూ పదిలంగా పట్టుకెళ్తోంది. తెలంగాణా ఎన్నికల కోసం కాంగ్రెస్ వేసిన టీమ్ జంబోజెట్ ని తలపిస్తోంది. ఇందులో లేని వాళ్ళేవరూ లేదు. అందరూ ఉన్నారు. దండిగా పదవులను పంచేశారు. కొత్తవి క్రియేట్ చేసి మరీ ఎవరికి వారికి తగిలించేశారు. బాగాన ఉంది. అందరూ పెద్దలే, అందరూ గొప్ప వారే, మరి వీర సారధ్యం వహించేదెవ్వరు.


అపుడే ముసలం :


ఇలా ఎన్నికల టీమ్ అనౌన్స్ అయిందో లేదో  అలా కాంగ్రెస్ లో  ముసలం మొదలైపోయింది. వాళ్ళకు పెద్ద పదవి, నాకు తక్కువ గౌరవం అంటూ లుకలుకలు స్టార్ట్ అయిపోయాయి. తనకు ఇచ్చిన పదవి పట్ల సీనియర్ నేత వీహెచ్ మండిపడుతూంటే టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెశిడెంట్ ఎలా ఇస్తారని మరో  నేత పొంగులేటి ఫైర్ అవుతున్నారు. ఇక పార్టీని ఎపుడో వదిలేసిన సురెష్ రెడ్డిని మూడు కమిటీల్లో పెట్టడం చూస్తూంటే కాంగ్రెస్ ఈ ఎన్నికలను  ఎంత సీరియస్ గా తీసుకుందో అర్ధమైపోతోంది. 


బంగారు పళ్ళెమేనా :


కాంగ్రెస్ వారి వద్ద ఎపుడూ బంగారు పళ్ళెం సిద్ధంగా ఉంటుంది. అది వాళ్ళ కోసం కానే కాదు. వాళ్ళలో వాళ్ళు కీచులాడుకుని ప్రతిపక్షానికి అధికారాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. మళ్ళీ అదే ట్రెండ్ రిపీట్ అయ్యేలా ఉంది సీన్ మొత్తం చూస్తూంటే. కాంగ్రెస్ కమిటీలు, గొడవలు చూస్తూంటే టీయారెస్ రేపటి ఎన్నికల్లో పెద్దగా కష్టపడకుండానే పవర్ దక్కేలా కనిపిస్తోంది. చూడాలి, ఎంత వరకూ సర్దుకుంటారో కాంగ్రెస్ నేతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: