ఇటీవల పాకిస్థాన్ దేశానికి నూతనంగా ఆ దేశ ప్రధానిగా ఎన్నికైన మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పాలనలో తనదైన ముద్ర వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తీసుకున్న నిర్ణయాలు బట్టి తెలుస్తోంది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ అధికారులకు విలాసవంతమైన సదుపాయాలను దూరం చేసి పాక్ ప్రజలకు దగ్గర అయ్యేలా పలు సంచలన కరమైన నిర్ణయాలు తీసుకున్నారు.

Image result for modi

అంతేకాకుండా అధికారికంగా తనకు ప్రభుత్వం కల్పించే విలాసవంతమైన భవనాలలో ఉండకుండా సాధారణమైన వ్యక్తిలా ఇంటివద్ద నుండి పాలనకు శ్రీకారం చుట్టి పాక్ లో కొత్త చరిత్ర సృష్టించారు ఇమ్రాన్ ఖాన్. ఈ నేపథ్యంలో తాజాగా భారత్ ప్రధాని మోడీకి ఇమ్రాన్‌ లేఖను పంపారు. ఆ లేఖలో ఆయన మోడీకి కృతజ్ఞతలు తెలపడంతో పాటు త్వరలోనే ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా కోరినట్లు తెలిపారు.

Image result for imran khan

ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలని శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించాలన్నారు. త్వరలోనే సార్క్‌ సదస్సును పాకిస్తాన్‌లో నిర్వహించేలా చూడలాని కోరుతూ పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా ఇమ్రాన్‌ అభ్యర్ధించారు. గతంలో ఈసదస్సు పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరగాల్సివుండగా జమ్ము -కాశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌ లోని ఆర్మీ స్థావరంపై ఉగ్రవాదుల దాడి జరగడంతో సార్క్‌ సదస్సుకు హాజరు కాలేమని ప్రకటించాయి.

Image result for imran khan

అయితే ఈ నేపథ్యంలో ఇమ్రాన్ భారత్ తో పాటు...పలు ఆసియా దేశాలను సార్క్ సదస్సు పాకిస్థాన్ లో నిర్వహించడానికి మద్దతు తెలపాలని కోరడం విశేషం. అయితే నూతనంగా పాక్ ప్రధానిగా ఎన్నికైన ఇమ్రాన్ ఖాన్ పాలనలో దూకుడుగా వ్యవహరిస్తూ మోడీ కి లేఖ రాయడంతో..భారత విదేశాంగ శాఖకు సంబంధించిన అధికారులు షాక్ తిన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: