చంద్ర బాబు నాయుడు మాట ఇస్తే మరిచి పోతాడు మాట మార్చుతాడు ఇది చంద్ర బాబు ట్రాక్ రికార్డు. ప్రత్యేకహోదా కోసం ఓసారి తీర్మానించిన చంద్రబాబు, ఆ హోదా దండగ అంటూ, అదే అసెంబ్లీలో ప్రత్యేక ప్యాకేజీకి అనుకూలంగా తీర్మానం చేసేశారు. ఆ తర్వాత మళ్ళీ ప్లేటు ఫిరాయించి, ప్రత్యేక హోదాకి అనుకూలంగా తీర్మానం చేయించి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

Image result for chandra babu

చట్టసభలు తీర్మానిస్తే, ఆ తీర్మానాలకి ఎంత విలువ వుండాలి.? దురదృష్టవశాత్తూ చంద్రబాబు చేతుల్లోపడి 'చట్ట సభల్లో తీర్మానం' అభాసుపాలైపోతోంది. కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానం చేసేసింది.. కానీ, ఇప్పుడు ఆ రిజర్వేషన్ల వ్యవహారమేమయ్యింది.? తీర్మానాలకి ఇంతటి దుర్గతి పట్టించడం చంద్రబాబుకి మాత్రమే చెల్లిందని అనుకోవాలేమో. అధికారం చేతుల్లో వుంటే, తనకు నచ్చినట్టు ఏదైనా చేసేయ్యొచ్చని చంద్రబాబు అనుకుంటున్నారనడానికి ఇదొక నిదర్శనం మాత్రమే.

Image result for chandra babu

ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాలకి ప్రజల్లో విలువ శూన్యం. ప్రశ్నించేదే ప్రతిపక్షం. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది అధికార పక్షం. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా ప్రతిపక్షానికి చెందిన 20 మందికి పైగా ఎమ్మెల్యేలను అధికార పార్టీల్లోకి లాక్కున్న ఘనత చంద్రబాబుదే. ఆ ఎమ్మెల్యేల్ని, పచ్చ కండువాలు కప్పి అసెంబ్లీలో తన పక్కనే కూర్చోబెట్టుకున్న చంద్రబాబు.. ప్రతిపక్షం అసెంబ్లీకి రావాల్సిన అవసరమే లేదన్నట్టు వ్యవహరిస్తుండడం హాస్యాస్పదంకాక మరేమిటి.?

మరింత సమాచారం తెలుసుకోండి: