యువత సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. విజయవాడలో ఈ రోజు జ్ఞానభేరి సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ యువతతోనే దేశ భవిత అన్నారు. ఎక్కడైతే యువతం మేధస్సు ఉపయోగిస్తుందో అక్కడ అభివ్రుధ్ధి సంపద ఉంటాయని అన్నారు. తెలుగు వారికి తెలివి తేటల్లో ఎవరూ సాటి రారని పోటీ కూడా లేదని చంద్రబాబు అన్నారు.


ప్రపంచాన్ని శాసించాలి :


తెలుగువారి ఈనాడు ప్రపంచాన్ని శాసిస్తున్నారని చంద్రబాబు అన్నారు.  సిలికాన్ వాలీలో తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నది తెలుగు వారికేనని, అది మనకు గర్వంతో పాటు స్పూర్తిని ఇవ్వాలని ముఖ్యమంత్రి అన్నారు. చదువుకోవదం అంటే కేవలం ఉపాధి కోసం మాత్రమే కాదని ఆయన అన్నారు. ఉద్యోగం కోసమే అయితే అది అందరూ చేస్తారని, పదిమందికి ఉపాధి చూపించే స్టార్టప్ వైపుగా యువత ఆలోచనలు మళ్ళించాలని చంద్రబబు పిలుపు ఇచ్చారు.


తెలివే పెట్టుబడి :


తెలివి తేటలే పెట్టుబడిగా ఎదిగిన వారు ఈ లోకంలో ఎందరో ఉన్నారని చంద్రబాబు చెప్పారు. లక్ష కోట్ల విలువ చేసే  ప్లిప్ కార్ట్ ని కూడా కొందరు యువకులు చాలా చిన్నగా మొదట్లో ప్రారంభించిందేనని బాబు గుర్తు చేశారు. అమెజాన్ డాట్ కం లాంటి సంస్థలూ అలాగే పుట్టాయని అన్నారు. తెలుగు వారంతా అలాగే ఎదగాలని కోరారు. భవిష్యత్‌లో టెక్నాలజీ ప్రధాన భూమిక పోషిస్తుంది. ఐటీ ద్వారా అద్భుతాలు చేయవచ్చు ఆ దిశగా యువత ఎదగాలని బాబు అన్నారు. టెక్నాలజీకి 20 ఏళ్ల క్రితమే బీజం వేశామని, తెలంగాణకు హైదరాబాద్‌ నుంచే అత్యధికంగా ఆదాయం  ఇపుడు వస్తోందని  చంద్రబాబు చెప్పారు


నేనున్నా :


అంధ్ర రాష్ట్ర యువతకు తాను అండగా ఉన్నానని బాబు భరోసా ఇచ్చారు. ఓ నిపుణుని మాదిరిగా సదస్సులో బాబు ప్రసంగం చేశారు. ఓ తండ్రిలా, మార్గదర్శిలా బాబు వారికి సలహా సూచనలూ ఇచ్చారు. ఉమ్మడి ఏపీలో సమాచార సాంకేతిక విప్లవానికి నాంది పలికిన చంద్రబాబు తన అనుభవ సారాన్నంతా రంగరించి విధ్యార్ధులకు జ్ఞాన బోధ చేసిన తీరు ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విధ్యార్ధులు హాజరయ్యారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు  పాల్గొన్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: