టీడీపీ ఇప్పుడు పూర్తిగా నారా వారి వశం అయిపోయిందని చెప్పాలి. అయితే ఇంకా నంద మూరి మనవడులైనా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నుంచి ప్రమాదం పొంచి ఉంది. తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా విజయబావుటా ఎగరవేయాలని కిందామీదా అవుతున్న మహాకూటమి, ఇద్దరు మనవళ్లను రంగంలోకి దించుతోందంటూ ఆంధ్రజ్యోతిలో ఓ కథనం వండారు. ఒకరు ఎన్టీఆర్ మనవడు కళ్యాణ్ రామ్. మరొకరు మర్రి చెన్నారెడ్డి మనవడు. మర్రి కుటుంబం పూర్తిగా రాజకీయాల్లోనే వుంది కాబట్టి పెద్దగా ఆశ్చర్యం లేదు.

Image result for kalyan ram

కానీ ఎన్టీఆర్ ఫ్యామిలీ కొంతవరకే రాజకీయాల్లో వుంది. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ సినిమాల్లో హీరోగా వున్నారు. ఆయన చేతిలో రెండు మూడు సినిమాలు వున్నాయి. హీరోగా ఇంకా బాగా ప్రూవ్ చేసుకోవాల్సిన స్టేజ్ లోనే వున్నారు ఆయన. ఇలాంటి నేపథ్యంలో రాజకీయాల్లోకి అందునా, తెలంగాణ రాజకీయాల్లోకి వస్తారా? అన్నది అనుమానం. ఇదంతా వట్టి ఫేక్ న్యూస్ అని కళ్యాణ్ రామ్ సన్నిహితులు కొట్టి పారేస్తున్నారు.

Image result for kalyan ram

కళ్యాణ్ రామ్ రాజకీయాల్లోకి రావడంలేదని, ఆయన సినిమాల మీద, సినిమా నిర్మాణాల మీద, ఇతర వ్యాపారాల మీద సీరియస్ దృష్టితో వున్నారని సన్నిహితులు చెబుతున్నారు. కానీ ఆంధ్రజ్యోతి లాంటి పత్రిక ఓ ఫేక్ న్యూస్ ను ఇంత ప్రముఖంగా ప్రచురిస్తుందా? అన్నది ఓ అనుమానం. లేదా, హరికృష్ణ ఫ్యామిలీని ఇప్పటి నుంచే తెలంగాణ రాజకీయాలకు పరిచయం చేసి, ఆ విధంగా తెలంగాణకు పరిమితం చేసి, ఆంధ్రలోకి రాకుండా చేయడానికి చంద్రబాబు ఏమన్నా ఎత్తుగడ వేస్తున్నారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: