చంద్ర బాబు కు మహారాష్ట్ర కోర్ట్  షాక్ ఇచ్చింది. చంద్ర బాబు ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. ధర్మాబాద్‌ న్యాయస్థానం జారీ చేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ విషయంలో. చంద్రబాబు డైరెక్షన్‌లో తెలుగు తమ్ముళ్ళు ఏ రేంజ్‌లో రెచ్చిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బీజేపీ కుట్ర అనీ, టీఆర్‌ఎస్‌ రాజకీయమనీ.. ఓ రేంజ్‌లో రచ్చ చేసి, తెలంగాణలో ఈ అంశం చుట్టూ నానా యాగీ చేసి.. చివరికి 'రీకాల్‌' పిటిషన్‌తో 'మమ' అన్పించేయాలనుకున్నారు చంద్రబాబు.

Image result for chandrababu naidu

అయితే, ధర్మాబాద్‌ న్యాయస్థానంలో చంద్రబాబు అండ్‌ టీమ్‌ పప్పులుడకలేదు. 'ముఖ్యమంత్రి అయినా, సామాన్యుడు అయినా న్యాయస్థానం దృష్టిలో ఒకటే..' అని తేల్చారు న్యాయమూర్తి. దాంతో, చంద్రబాబు ధర్మాబాద్‌ న్యాయస్థానంలో హాజరుకాక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అక్టోబర్‌ 15వ తేదీకి న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. ఆ రోజు చంద్రబాబు, న్యాయస్థానం ముందు హాజరుకావాల్సి వుంటుంది.

Image result for chandrababu naidu

నిజానికి, విచారణకు హాజరై పబ్లిసిటీ పొందాలని తొలుత చంద్రబాబు భావించారు. 'అది దండగ వ్యవహారం..' అంటూ చంద్రబాబుకి కొంతమంది 'సన్నిహితులు' ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో ఉచిత సలహాలిచ్చేశారు. దాంతో, కోర్టుకు హాజరై పబ్లిసిటీ స్టంట్‌ చేయాలనుకున్న చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు. ఇప్పుడేమో పరువు పోయింది. కోర్టు వాతలు పెట్టాక, హాజరైతే.. పబ్లిసిటీ రాదు సరికదా.. అభాసుపాలైపోయినట్లే అవుతుంది. కానీ, తప్పదు.. విచారణకు హాజరయి తీరాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: