టీడీపీ లో అన్ని నియోజక వర్గాల అభర్ధులు ను పూర్తి చేస్తూ ఆ పార్టీ ముందుకు దూసుకు పోతుంది అయితే లోకేష్ పోటీ చేయబోయే స్థానం ఇంత వరకు ఖరారు కాలేదు. అయితే వారం కిందటే ఇలాంటి కథనాలే రాశాయి అనుకూల మీడియా వర్గాలు. అప్పుడు కూడా ఇదే చంద్రగిరి, అదే పుంగనూరు, అదే పీలేరుల గురించి కథనాలు ఇచ్చారు. వీటిల్లో అభ్యర్థులు ఖరారు అయిపోయారని రాశారు. ఇప్పుడు మళ్లీ అదే కథనాలు.

Image result for lokesh

పీలేరులో కిషోర్ కుమార్ రెడ్డి అని, చంద్రగిరిలో పులిపర్తి నాని అని అప్పుడే చెప్పారు. ఇప్పుడు మళ్లీ చెబుతున్నారు. చెబితే చెప్పారు కానీ, లోకేష్ గురించి చెప్పడం మాత్రంలేదు. లోకేష్ ఎక్కడ నుంచి పోటీచేస్తాడో ఇప్పటివరకూ ఏమాత్రం క్లారిటీ లేకపోవడం విశేషం. ఎన్నికలు రావాల్సిన సమయానికే వచ్చినా మరెంతో టైమ్ లేనట్టే. అయితే ఇప్పటి వరకూ లోకేష్ పోటీకి సంబంధించి ఎలాంటి వార్తలూ రావడంలేదు. కనీసం ఊహాగానాలు కూడా లేకపోవడం విశేషం.

Image result for lokesh

తన తనయుడికి తగిన నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకూ వెదికినట్టుగా లేడు. ఇప్పటికే నేతల్లో టెన్షన్ మొదలైంది. ప్రస్తుత నియోజకవర్గంలోనే పోటీ చేయడమా, పక్క నియోజకవర్గానికి వెళ్లడమా.. అనే అంశాలపై వారి తర్జనభర్జనలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు తనయుడి విషయంలో మాత్రం ఇలాంటి ఊసేలేదు. లోకేష్ మాటలేమో కోటలు దాటుతూ ఉంటాయి. తను ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యి, మంత్రి అయిపోవడం అంటే.. అదేదో ఎవరెస్టును అధిరోహించినంత గొప్ప అని చెప్పుకొంటూ ఉంటాడు. ఈ జన్మకు ఇదిచాలని అనుకుంటున్నాడా? ఇక ప్రత్యక్ష పోటీకే ముందుకు రాడా?

మరింత సమాచారం తెలుసుకోండి: