తమన్ ది కాపీ మ్యూజిక్ అని ట్యూన్స్ ఎక్కడో ఒక చోట నుంచి కాపీ కొడతాడని తమన్ మీద గట్టిగా విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శను తిప్పికొట్టాలని, దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకోవాలని ఈ మ్యూజిక్ డైరక్టర్ ఎప్పుడూ అనుకోడేమో. తాజాగా మరోసారి ఇదే టైపులో విమర్శల పాలవుతున్నాడు తమన్. నిన్ననే అరవింద సమేత ఆడియో సాంగ్స్ అన్నీ మార్కెట్లోకి వచ్చాయి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. పాటలు ఇలా మార్కెట్లోకి వచ్చాయో లేదో, తమన్ వాటిని ఎక్కడ్నుంచి ఎలా ఎత్తేశాడో, విజువల్స్ తో సహా సోషల్ మీడియాలో క్లిప్పింగులు కుప్పలుతెప్పలుగా పడుతున్నాయి.. 

Image result for thaman music director

మరీ ఆశ్చర్యంగా ఈసారి తన ట్యూన్స్ ను తానే కాపీకొట్టాడు తమన్. ఛల్ మోహన్ రంగలో ఇచ్చిన ఓ ట్యూన్ నే యాజ్ ఇటీజ్ గా అరవింద సమేత కోసం వాడేశాడు. ఇక గతంలో రవితేజ నటించిన నిప్పు సినిమాకు ఇచ్చిన ట్యూన్ నే మరో పాటకు వాడేశాడు. ప్రస్తుతం ఆ ఆడియో సాంగ్స్ ను, గతంలో వచ్చిన పాటలతో పోలుస్తూ చాలా క్లిప్పింగులు యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్ లో దర్శనమిస్తున్నాయి. 

ఏంటి తమన్ ఇది.. మరీ ఇంత పబ్లిక్ గానా..!

తమన్ గాడిలో పడ్డాడని, తొలిప్రేమ లాంటి సినిమాలకు కాస్త ఫ్రెష్ మ్యూజిక్ ఇచ్చాడని మొన్నటివరకు చాలామంది సంతోషించారు. కానీ అరవింద సమేత పాటలు విన్న తర్వాత మళ్లీ పాత తమన్ మరోసారి అందరికీ గుర్తొచ్చాడు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే.. ఏ సంగీత దర్శకుడితోనైనా కాస్త ఫ్రెష్ ట్యూన్స్ రాబట్టుకుంటాడనే పేరున్న త్రివిక్రమ్ కూడా తమన్ దగ్గరకొచ్చేసరికి ఫెయిల్ అయిపోయాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: